Advertisement
Google Ads BL

‘మోడీ’ సంకల్పం కోసం పురాణపండ చేస్తుందిదే!


‘మోడీ’ సంకల్పం కోసం నరసింహస్వామిని తీసుకొస్తున్న పురాణపండ శ్రీనివాస్

Advertisement
CJ Advs

కోవిడ్-19 సృష్టించగల మానవ మహా విషాదం తాలూకు భయంతో భారత్ సహా పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా వ్యాప్తి నిరోధానికి తాపత్రయపడుతున్న ఈ విపత్కర పరిస్థితిలో... ఈ భయంకర వ్యాధి ఇబ్బంది నుంచి రక్షించమని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి మద్దతుగా... కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి సమర్పణలో తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ప్రముఖులు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సుధీష్ రాంభట్ల, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఒక అద్భుతమైన దైవీయ గ్రంధాన్ని ప్రచురించి ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాలలో లక్షల ప్రతులు ఉచితంగా పంచబోతున్నారు.

ఆది శంకరాచార్య ప్రణీతమైన మహాశక్తి సంపన్నస్తోత్రమ్ ‘‘శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్’ ప్రచురణ మహత్కార్యాన్ని ప్రముఖ రచయిత, జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్‌కి అప్పగించారు. పురాణపండ శ్రీనివాస్ అపురూప మహాగ్రంధం ‘నన్నేలు నాస్వామి’ని ఇటీవల భారత హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి శ్రీనివాస్ పై ప్రశంసలు వర్షించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక  సంస్థ ‘జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం’ సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్తగా వెలువరించిన ఎన్నో సమ్మోహన గ్రంధాలకు భారీ డిమాండ్ వున్న విషయం భక్త పాఠకులకూ, రసజ్ఞులకూ తెలిసిందే.

భారతదేశంలో ప్రముఖమైన పదహారు నృసింహ క్షేత్రాల మూలవిరాట్టుల మనోహర మంగళ దృశ్యాలతో, అందమైన వ్యాఖ్యాన వైఖరితో పరమ శోభాయమానంగా ఈ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దుతున్నారు. శంకర జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్న ఈ పుస్తకాన్ని భారతీయ జనతాపార్టీ కార్యకర్తల ద్వారా పంపిణీ చేస్తారు.

PURANAPANDA SRINIVAS SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM soon:

SRI LAKSHMI NRUSIMHA KARAVALAMBA STOTRAM Release Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs