Advertisement
Google Ads BL

పుష్ప సెకండ్ లుక్ : బన్నీ ట్రీట్ అదిరింది..


అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర ఫస్ట్ లుక్ నేడు వచ్చేసింది. పుష్ప అనే విచిత్ర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. లారీడ్రైవర్ గా అల్లు అర్జున్ మేకొవర్ చాలా సహజంగా ఉంది. గుబురు గడ్డం, పెరిగిన్ జుట్టు, తాయెత్తు తో చూడగానే లారీ డ్రైవరే అనుకునేంత సహజంగా కనిపించాడు. ఈ ఫస్ట్ లుక్ లో బన్నీ కళ్ళలో ఒకలాంటి కసి కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఆ కసి చూస్తుంటే ఈ సినిమాలో బన్నీ రోల్ అదిరిపోనుందని అర్థం అవుతుంది. అయితే కరోనా వేళ జనాలందరూ ఇంటికే పరిమితమైపోయిన సందర్భంలో బన్నీ సినిమా నుండి వచ్చిన అప్డేట్ అతని అభిమానుల్లో ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టించడానికి ఫస్ట్ లుక్ వచ్చిన రెండు గంటల్లోనే సెకండ్ లుక్ ని చదిలారు. ఈ సారి బన్నీ పోలీసులకి పట్టుబడ్డట్టుగా కనిపించాడు.

నేలమీద కూర్చుని, చేతికి కడియం ,వేలికి ఉంగరం, సాధారణ చెప్పులు ధరించి ఊరమాస్ గా కనిపించాడు. వెనకాల ఎర్రచందనం దుంగలు చూస్తుంటే వాటిని దొంగతనంగా సరఫరా చేస్తుంటే పట్టుబడ్డాడేమో అనిపిస్తుంది. మొత్తానికి బన్నీ తన పుట్టినరోజు నాడు అభిమానులకి డబుల్ ట్రీట్ ఇచ్చాడు.

Pushpa second look: Bunny special treat for his fans:

Bunny special treat for his fans second look from Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs