Advertisement
Google Ads BL

మరో స్టార్ డైరెక్టర్‌తో నమ్రత చర్చలు!?


‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తర్వాత అసలు ఎవరితో సినిమా చేయాలి..? బోలెడంత మంది దర్శకులు వచ్చి కథలు చెబుతుండటంతో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి..? అనేది తెలియక సూపర్ స్టార్ మహేశ్ బాబు తెగ ఇబ్బంది పడుతున్నాడు. వంశీ పైడిప‌ల్లితో సినిమా అర్థాంత‌రంగా ఆగిపోవ‌డంతోనే ఈ సమస్యలన్నీ మొదయ్యాయ్. ఒకసారేమో పరుశురామ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. మరోసారేమో అబ్బే కొత్త డైరెక్టర్‌కు అని ఇలా చాలా మంది పేర్లే తెరపైకి వస్తున్నాయ్. వీటితో పాటు అప్పట్లో పూరీ జగన్నాథ్ చేయాలనుకున్న ‘జనగణమన’ కూడా తెరపైకి వచ్చింది. స్వయంగా మహేశ్ సతీమణి నమ్రతే రంగంలోకి దిగి పూరీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. 

Advertisement
CJ Advs

పూరీతో చర్చలు ఎంతవరకూ వచ్చాయో ఇప్పటి వరకూ తెలియరాలేదు కానీ.. తాజాగా నమ్రత మరో స్టార్ డైరెక్టర్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదండోయ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. వాస్తవానికి మహేశ్‌కు కూడా మాంత్రికుడితో సినిమా చేయాలని ఎప్పట్నుంచో మనసులో ఉంది. ఈ కాంబోలో సినిమా వస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరిగినా ఇప్పటి వరకూ అది జరగలేదు. మరోవైపు ఈ కాంబోతో ఎలాగైనా సినిమా చేయించాలని నమ్రత కోరిక కూడా.!. తాజాగా.. నమ్రత తన మేనేజర్‌తో త్రివిక్రమ్ కాల్ చేయించి మాట్లాడించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం.. మాటల మాంత్రికుడి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ కాకుండా ఇంకా రెండు కథలు ఉన్నాయట. ఆ రెండింటిలో మహేశ్‌కు సెట్ అయ్యే స్టోరీ ఉందేమో చూడాలని నమ్రత మాటగా మేనేజర్ చెప్పాడట. అయితే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారన్నది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఈ కాంబో సెట్ అయితే రంగంలోకి దిగాలని అనిల్ సుంకర ఎదురుచూస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ జరగలేదు.. ఒకవేళ ఈ కాంబోలో సినిమా వస్తే అది ఎనిమిదో వింతేనని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ నుంచి మళ్లీ ఫోన్ కాల్ ఎప్పుడు వెళ్తుందో.. రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో..? ఈ పుకార్లలో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

Mahesh Wife Talks Star Director Over Mahesh Movie!:

Mahesh Wife Talks Star Director Over Mahesh Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs