Advertisement
Google Ads BL

కొత్త కుర్రాడితో త్రివిక్రమ్.. 35కోట్ల పారితోషికం!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్‌లో ఉన్న రేంజ్.. క్రేజే వేరు. ఎలాంటి జీరోను అయినా ఆయన చేతిలో పెడితే స్టార్ చేసేస్తాడని కొందరు గట్టిగా విశ్వసిస్తుంటారు. వాస్తవానికి అది నిజమే.. ఎందుకంటే.. ఆయన పరిచయం చేసిన హీరోలను చూసినా.. తెరకెక్కించిన చిత్రాలు చూసినా ఆ లెక్క అర్థమవుతుంది. అయితే తాజాగా ఓ ప్రముఖ వ్యాపారవేత్త తన కుమారుడ్ని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయాలని కోరాడట. మీరు కాదనకుండా ఈ బాధ్యతను తీసుకోవాల్సిందేనని పదే పదే కోరాడట. ప్రముఖ బిజినెస్‌మెన్ కావడం.. పైగా గట్టిగానే పారితోషికం ఇస్తానని చెప్పడంతో మాంత్రికుడు కూడా కాదనలేకపోయాడట. ఒకటి రెండ్రోజులు ఆలోచించిన ఆయన ఫైనల్‌గా ఓకే చెప్పేశాడట.

Advertisement
CJ Advs

35 కోట్లు పారితోషికం..!

అయితే.. త్రివిక్రమ్ ఆ మాట చెప్పిన గంటలోనే.. హారికా అండ్ హాసిని ఆఫీస్ నుంచిఫోన్ కాల్ వచ్చిందట. ఫలానా బిజినెస్‌మెన్ అంతా వివరంగా చెప్పారని.. మీతో మాట్లాడమని చెప్పారని.. మీకు ఓకే కదా సార్ అన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశమట. సినిమా సుమారు 200 కోట్లతో నిర్మించడానికి సదురు బిజినెస్‌మెన్ ప్లాన్ చేస్తున్నారట. ఇంకా ఎక్కువైనా ఫర్లేదు కానీ మా కుర్రాడి స్టార్ అయిపోవాలని ఆయన చెప్పాడట. అంతేకాదు.. త్రివిక్రమ్‌కు కూడా రూ. 35 కోట్లు పారితోషికంగా ఇస్తానని చెప్పాడట. ఇది తాను అనుకుంటున్న ఫిగర్ అని.. మీకు ఇంకా ఎక్కువ కావాలన్న వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడట. ఆ విషయం మాత్రం ఇంకా త్రివిక్రమ్‌ ఆలోచించలేదట.

ఇంతకీ ఎవరాయన!?

ప్రస్తుతానికి త్రివిక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్ కోసం కథ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. పైగా ఆయన దగ్గర ఒకట్రెండు కథలు సిద్ధంగా ఉన్నాయట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్.. రిలీజ్ లేట్ అవుతుందని ఈ గ్యాప్‌లో కుర్రాడితో ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేసేయాలని మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. ఇంతకీ ఎవరా బిజినెస్‌మెన్..? వివరాలు ఎందుకింత గోప్యంగా ఉంచుతున్నారు..? అనేది మాత్రం తెలియరాలేదు. మరోవైపు త్రివిక్రమ్ కోసం.. ఒకరిద్దరూ పెద్ద హీరోలు సైతం వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో జస్ట్ వెయిట్ అండ్ సీ.. మరీ ముఖ్యంగా ఈ కొత్త కుర్రాడిని పరిచయం అనే వ్యవహారంపై కూడా అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Trivikram With New Hero.. 35 Crores Remuneration!:

Trivikram With New Hero.. 35 Crores Remuneration!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs