Advertisement
Google Ads BL

సారీ అనిల్.. సోలో ఉంటే చెప్పంతే..!?


టాలీవుడ్‌లో హిట్ చిత్రాల దర్శకుల్లో ఒకరుగా అనిల్ రావిపూడి ఓ వెలుగు వెలుగుతున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కించి బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో ఆయనతో కలిసి పనిచేయడానికి పెద్ద హీరోలు సైతం రెడీగా ఉన్నారు. ఇప్పుడంతా అనిల్ కన్ను కూడా స్టార్‌లపైనే ఉంది. అయితే ఇదంతా కరోనా వ్యవహారానికి ముందు.. అయితే తాజాగా అనీలే హీరోలను వెతుక్కునే పనిలో పడ్డాడట. అదేంటి ఆయన కోసం క్యూ కడుతుంటే.. ఈయన వెతుక్కోవడమేంటని అనుకుంటున్నారా..? అసలు విషయం తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి.

Advertisement
CJ Advs

అసలు విషయానికొస్తే.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో సీక్వెల్ చేస్తున్నాడు. ఇది ‘ఎఫ్-3’ కావడంతో వెంకీ, వరుణ్‌తో పాటు మరో హీరో తప్పనిసరి. ఆ హీరోగా ఎవర్ని తీసుకోవాలి..? అని ఆలోచనలో పడ్డాడట అనిల్. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ పూర్తయ్యే లోపు ఆ మూడో హీరోను పట్టేయాలని అనిల్ అనుకున్నప్పటికీ వర్కవుట్ అవ్వట్లేదట. ఒకరిద్దర్ని ఫోన్‌లో సంప్రదించగా.. ఎస్ అనిల్ నీతో కలిసి పనిచేయాలని నాకూ ఉంది కానీ.. ఇలా మూడో హీరోగా అంటే కష్టం.. సోలోగా ఉంటే చెప్పు కచ్చితంగా చేద్దాం.. ఈ సినిమాలో మాత్రం చేయలేను సారీ..’ చెప్పేస్తున్నారట. అనిల్ సంప్రదించిన ఆ ఇద్దరు ఎవరనేది మాత్రం తెలియరాలేదు.

ఇందుకు కారణం.. సినిమా మల్టీస్టారర్ కావడం అందులోనూ మూడో హీరో అంటే పాత్ర ఎలా ఉంటుందో..? సెట్ అవ్వకపోతే ఇమేజ్ పోతుందేమో..? స్క్రీన్ టైమ్‌ కూడా పెద్దగా రాదేమో..? అని ఒకింత భయపడుతున్నారని టాక్. అయితే.. అనిల్‌కు ఇవన్నీ చెబితే ఎక్కడ ఫీలవుతాడో అని చెప్పలేకపోతున్నారట. ఇప్పటికే మహేశ్ బాబు, రవితేజను సంప్రదించగా సారీ చెప్పేశారని వార్తలు వచ్చాయి. మరి ఆ రేంజ్‌ హీరో అనిల్‌కు దొరకుతారో లేదో.. జస్ట్ వెయిట్ అండ్ సీ.

Heros Says Sorry To Anil Raavipudi Over Act in F3 Movie!:

Heros Says Sorry To Anil Raavipudi Over Act in F3 Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs