Advertisement
Google Ads BL

స్టార్ హీరోలూ స్పందించండి.. ప్రియమణి డిమాండ్


ప్రియమణి.. తెలుగు సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వరుస సినిమాలతో హడావుడి చేసి ఆ తర్వాత కొత్త భామలు వచ్చేసరికి ఈ బ్యూటీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అవకాశాలు తగ్గిపోవడంతో చేసేదేమీ లేక ప్రస్తుతం రియాలిటీ షోలకే పరిమితం అయ్యింది. అలా రాణించేస్తున్న ఈ బొద్దుగుమ్మ తాజాగా హాట్ హాట్ వ్యాఖ్యలు చేసి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

వారికి సరే మా సంగతేంటి..?

అసలు విషయానికొస్తే.. పారితోషికాల గురించి ప్రస్తావించిన ఈ భామ హీరోయిన్స్ మొదలుకుని స్టార్ హీరోలను సైతం కెలికింది. ‘సౌత్ ఇండస్ట్రీలో కథానాయికలకు వారి టాలెంట్‌కి తగిన పారితోషికాలు అందట్లేదు. లేడీ సూపర్ స్టార్ నయనతార, అనుష్క, సమంత వంటి కొందరికే భారీగా పారితోషికాలు అందుతున్నాయి. రెమ్యునరేషన్‌తో పాటు సరైన గౌరవ మర్యాదలు కూడా దక్కుతున్నాయి.. కానీ మధ్యతరగతి కథానాయికల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికిస్తున్న పారితోషికాలు చాలా తక్కువ. చాలామందికి కనీస పారితోషికం కూడా అందట్లేదు. కథ చెప్పిన తర్వాత పారితోషికానికి.. షూటింగ్ పూర్తయ్యాక ఇచ్చే పారితోషికానికి చాలా తేడా ఉంటోంది. ముందుగా ఇస్తామన్న పారితోషికాలు కూడా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు’ అని ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది.

హీరోలు స్పందించాలి..

అంతటితో ఆగని ప్రియమణి హీరోలను సైతం టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోల డామినేషన్స్‌ నడుస్తోందని.. పరోక్షంగా ఆమె సెటైర్లేసింది. ఇండస్ట్రీలు మధ్యతరగతి హీరోయిన్లు పడుతున్న కష్టాలపై స్టార్ హీరోలు, హీరోయిన్లు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రియమణి డిమాండ్ చేసింది. మొత్తానికి చూస్తే అవకాశాలు రాకపోవడంతో ప్రియమణి మాటల్లో పూర్తిగా ప్రస్టేషన్ కనిపించిందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భామ కామెంట్స్‌పై టాలీవుడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

Actress Priyamani Comments On Star Heros:

Actress Priyamani Comments On Star Heros  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs