Advertisement

పవన్-రవితేజ మల్టీస్టారర్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగే!


టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీల హవా గట్టిగానే నడుస్తోంది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ఏ ముహూర్తంలో మల్టీస్టారర్ సినిమాలు వర్కవుట్ చేశాడో నాటి నుంచి తెలుగులో తెగ వచ్చేస్తున్నాయ్. ఇప్పటికే ‘బాహుబలి’ పార్ట్-01, 02లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటిలతో సినిమా తీయడం.. ఆ తర్వాత మల్టీ స్టారర్‌ను మించిన ‘RRR’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మరోవైపు జక్కన్నే కాకుండా ఇతర హీరోలు కూడా తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీస్ సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయి. దీంతో దర్శకులు కూడా తమకు నచ్చిన.. ఫలానా హీరో అయితే పక్కాగా సక్సెస్ అని నమ్ముతారో వారితో సినిమాలు తీయడానికి ముందుకొచ్చేస్తున్నారు.

Advertisement

ఇక అసలు విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- మాస్ మహరాజ్ రవితేజ క్రేజీ కాంబినేషన్‌‌లో మాంచి మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని గత రెండు మూడ్రోజులుగా ఓ పుకారు టాలీవుడ్‌లో తెగ షికారు చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు డైరెక్టర్‌గా బాబీ అని టాక్ నడుస్తోంది. మరోవైపు.. డైరెక్టర్ డాలీ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే అటు మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు.. ఇటు రవితేజ అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవ్. 

వాస్తవానికి.. రవితేజ అంటే పవన్‌కు అమితాభిమానం. పలుమార్లు ఆయన గురించి.. ఆయన కెరీర్ గురించి స్టేజ్‌లపై చెప్పాడు కూడా. కచ్చితంగా ఈ సినిమా సెట్ అవుతుందని.. అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కూర్చోని ఓ మాట అనేసుకుని.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇది ఎంతమాత్రం వర్కవుట్ అవుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ..!.

Exciting Pawan and Ravi Teja In A Multistarrer?:

Exciting Pawan and Ravi Teja In A Multistarrer?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement