Advertisement
Google Ads BL

ఇల్లీ బేబీ.. ఏంటీ షాకింగ్ డెసిషన్!


గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. తన రేంజ్‌ ఏంటో చూపించేసింది. అంతేకాదు.. కాస్త అటు ఇటు ఓ రేంజ్‌ హీరో స్థాయిలో పారితోషికం తీసుకుంటూ ఉండేదంటే అర్థం చేసుకోవచ్చు. అయితే.. టాలీవుడ్‌ను ఏలేసిన ఇల్లీ.. బాలీవుడ్‌ను బాగా దున్నేద్దాం అని వెళ్లి ఒకట్రెండు సినిమాలకే చతికిలపడింది. ఆ దెబ్బతో అప్పట్నుంచీ ఇప్పటి వరకూ కోలుకోలేకపోతోంది. అప్పట్లో టాలీవుడ్‌పై ఇష్టానుసారం మాట్లాడేసింది. దీంతో కష్టకాలంలోనూ తెలుగులో దాదాపు అవకాశాలు కరువైపోయాయి. అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో చేసేదేమీ లేక ప్రేమలో పడటం.. బ్రేకప్ అవ్వడంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆపసోపాలు పడుతోంది. 

Advertisement
CJ Advs

యాంకరింగే ముద్దట..

ఇల్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి దారులన్నీ మూసుకుపోవడంతో కొత్త రూట్‌లో వెళ్లాలని నిర్ణయం తీసుకుందట. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులే కాదు కుటుంబ సభ్యులు సైతం కంగుతిన్నారట. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే.. ‘ఇక సినిమాల్లో వద్దు.. యాంకరింగే ముద్దు’ అనుకుంటోందట. అంటే.. యాంకరింగ్‌పైనే పూర్తి దృష్టిపెడుతుందట. అది కూడా ఆడియో ఫంక్షన్స్, టీవీ షోలు కాదండోయ్ బాబూ.. ఏకంగా ఓ ప్రముఖ స్పోర్ట్స్ చానెల్‌లో యాంకరింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందట. 

ఆ రెండూ అవ్వగానే..

ఇలియానాకు అందం, ఐశ్వర్యం.. ఆహార్యం ఇలా చెప్పుకుంటూ పోతే పెరిగిందే వయసే కానీ ఇప్పటికీ హాట్ హాట్‌గానే కనిపిస్తుంటుంది. దీన్ని క్యాష్ చేసుకోవాలన్న ఓ ప్రముఖ స్పోర్ట్స్ చానెల్.. ఇల్లీ బేబీ అయితే యాంకరింగ్‌తో కరెక్ట్‌గా సెట్ అవుతుందని యాజమాన్యం సంప్రదించిందట. పైగా ఇప్పటి వరకూ టాలీవుడ్, బాలీవుడ్‌లో ఇంకా ఒకట్రెండు ఇండస్ట్రీల్లోనే ఈ భామ మెరిసింది.. యాంకరింగ్‌కు వెళితే ఇంటర్నేషనల్‌లో లెవల్‌ తన పేరు మార్మోగుతుందని భావించిన ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే తాను రెండు సినిమాలకు (రవితేజతో ఓ సినిమా.. బాలీవుడ్ సినిమా) కమిట్మెంట్ ఇచ్చానని పూర్తవ్వగానే రంగంలోకి దిగుతానని చెప్పిందట. సో.. మొత్తానికి చూస్తే సినిమాలకు గుడ్ చెప్పేసి.. ఇక యాంకర్‌గా ఇల్లీ బేబీ మెరవనుందన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Star Heroine Ileana Shocking Decision.. She Turns As..:

Star Heroine Ileana Shocking Decision.. She Turns As..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs