Advertisement
Google Ads BL

RRRలో మరో స్టార్ హీరో..!


ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR ముచ్చట్లు కరోనా కారణంగా వచ్చిన గ్యాప్‌తో రోజుకొకటి బయటికి వస్తున్నాయి. రామ్ చరణ్ స్పెషల్ వీడియోకి భీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. అన్ని భాషల్లోనూ RRR స్పెషల్ వీడియోకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బడా స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. అజయ్ దేవగన్ ముచ్చట్లు రాజమౌళి తెరలు తెరలుగా చెబుతున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది కాబట్టి.. అనేక భాష నటులు నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

అందుకే పలు భాష నటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాట సముద్రఖని నటిస్తున్నాడు. అయితే RRR లో ఓ స్పెషల్ గెస్ట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నాడని గాసిప్ బయలుదేరింది అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది మలయాళ నటుడు మోహన్ లాల్.. ఎన్టీఆర్ అంటే కొమరం భీం పాత్రలకి బాబాయ్ గా కనిపించబోతున్నాడట. కొమరం బీమ్ లైఫ్ లో ఆయన బాబాయ్ పాత్ర చాల కీలకమని... అందుకే ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం అతిధి పాత్రలో మోహన్ లాల్ ని రాజమౌళి తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో అనేది రాజమౌళి స్పందిస్తేనే కానీ తెలియదు.

One More Star Hero in RRR Movie:

Mohan Lal plays Uncle role to Jr ntr in RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs