Advertisement
Google Ads BL

పడేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా..!!


రాజమౌళి RRR మోషన్ పోస్టర్ దగ్గరనుండి... రామ్ చరణ్ స్పెషల్ వీడియోతో RRR మూవీ క్రేజ్ ఇండియా వైడ్‌గా పెరిగిపోయింది. అసలే రాజమౌళి RRR పై ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజుంది. ఇక టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ తో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే RRR లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎవరి బర్త్ డే అయినా స్పెషల్ గా వీడియోస్ ని వదిలే రాజమౌళి కరోనా కారణంగా టెక్నీకల్ ఇష్యూస్ వలన అజయ్ దేవగన్ బర్త్ డే కి ఆయనపై ఎలాంటి వీడియో వదలలేకపోయాడు. దీనికి సారీ కూడా చెప్పిన రాజమౌళి తాజాగా అజయ్ దేవగన్ ని RRR లకి ఎలా సెలెక్ట్ చేసారో అనే విషయంపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసాడు. అదేమిటంటే ఈగ సినిమాకి బాలీవుడ్ వాయిస్ ఓవర్ అందించిన అజయ్ తో మళ్లీ పదేళ్ల తర్వాత వర్క్ చెయ్యడమే ఆనందంగా ఉంది.

Advertisement
CJ Advs

అసలు RRR కి ఓ కీలక పాత్రకి బాలీవుడ్ నటుడిని అనుకున్నప్పుడు.. ఆ పాత్రలో నిజాయితీ, ఉచ్చరించే మాటలో న్యాయం కనబడాలని, ఆ పాత్రలో లీనమై నటించే నటుడు చెప్పే డైలాగ్స్ అందరూ నమ్మేలా నిజాయితీగా ఉండాలని అనుకున్నప్పుడు...నేను చాలామందిని ఆ పాత్రకి సంబందించిన నటుడు కోసం సలహాలు అడగగా.... పది మందిలో తొమ్మిదిమంది అజయ్ దేవగన్ పేరునే సూచించారని అలా RRR కి అజయ్ దేవగన్ ని అనుకోవడం ఆయన ఒప్పుకోవడం మా అదృష్టమని చెబుతున్నాడు. ఇక అజయ్ దేవగన్ పాత్ర RRR లో చాలా కీలకమని... అజయ్ దేవగన్ RRR ని ఎంతో అంకిత భావంతో చేసారని చెబుతున్నాడు. 

How Ajay Devgn Got Role In RRR?:

<h1><span style="font-weight: normal;">Rajamouli about Ajay Devgan role in RRR</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs