Advertisement
Google Ads BL

రౌడీస్టార్ గురించి ఎంత గొప్పగా చెప్పిందో చూడండి!


ఇప్పటికే బాలీవుడ్ భామలు విజయ్ దేవరకొండ స్టయిల్‌కి తెగ ఇదైపోతున్నారు. అలియా భట్ దగ్గరనుండి జాన్వీ కపూర్ వరకు రౌడీ స్టార్ స్టయిల్ ని తెగ పొగిడేస్తున్నారు. విజయ్ దేవరకొండ డ్రెస్ సెన్స్‌కి, హెయిర్ స్టయిల్ కి నటనకు అందరూ ఫిదానే. తాజాగా బాలీవుడ్‌లో మరో భామ విజయ్ దేవరకొండ స్టయిల్ ని ఆయన వ్యక్తిత్వాన్ని తెగ పొగిడేస్తోంది. ఆమె ఎవరో కాదు.. పూరి జగన్నాద్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా విజయ్ దేవరకొండని తెగ మోసేస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న అనన్య పాండేతో విజయ్ రొమాంటిక్ గా అదరగొడుతున్నారు. విజయ్ - అనన్య ల రొమాన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉంది. ఇప్పటికే 40 రోజుల పాటు అనన్య పాండే - విజయ్ దేవరకొండ కలిసి షూటింగ్ చేసారు. ముంబైలో పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్ తో విజయ్ గురించి అనన్య చాలా అర్ధం చేసుకుందట.

Advertisement
CJ Advs

కరోనా కారణంగా లాక్ డౌన్‌తో పూరి ఛార్మి విజయ్ దేవరకొండ లు షూటింగ్ కి బ్రేకిచ్చేసి హైదరాబాద్ కి వచ్చేసారు. అయితే తాజాగా పూరి జగన్నాద్ సినిమా గురించి, విజయ్ దేవరకొండ గురించి అనన్య పాండే మాట్లాడుతూ... విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయినప్పటికీ.. అస్సలు గర్వం ఉండదని, చాలా వినయంగా ఉంటాడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అని, చాలా దయగల హీరో అని, అలాగే సున్నితంగా మాట్లాడే మనిషి విజయ్ అంటూ విజయ్ ని తెగ పొగిడేస్తోంది. ఇక ఈ సినిమాని అనేక భాషల్లో పాన్ ఇండియా ఫిలింగా తెరకెక్కిస్తున్నారు. ఇక తెలుగు తమిళం అంటే విజయ్ క్రేజ్. ఇక నాకు బాలీవుడ్ లో కాస్త అనుభవం ఉంది. విజయ్ కి హిందీ కొత్త. నాకు సౌత్ కొత్త. అందుకే ఇతర భాషల్లో మా సినిమాని ప్రేక్షకులు మెచ్చుకుంటారు? వారిని మెప్పించగలమా అంటూ కాస్త కంగారుగానే ఉంటుంది. ఇక అన్ని భాషలకు నా డబ్బింగ్ నేనే చెప్పుకోవాలని అనుకుంటున్నాను. వీలైనంతవరకు ప్రయత్నిస్తాను అంటూ పూరి - విజయ్ సినిమా ముచ్చట్లు అనన్య రివీల్ చేసేసింది.

ananya pandey talks about vijay deverakonda:

ananya pandey Praises vijay deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs