Advertisement
Google Ads BL

మెగా ఫ్యాన్స్‌ను ఆలోచనలో పడేసిన చిరు ట్వీట్!


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత నెల ఉగాది రోజున సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే అడుగుపెట్టారో నాటి నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గంటగంటకూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ.. లేదా ఏదైనా కొత్త విషయాలను.. తనకు సంబంధించిన విషయాలను అభిమానులు, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు.. నటీనటులను ఉద్దేశించి కూడా చిరు ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ మెగాభిమానులను ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఆ ట్వీట్‌ ఏంటి..? ఆ ట్వీట్‌గా మెగాభిమానులు ఎందుకంతలా ఆలోచిస్తున్నారో..? ఈ కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

ఇంతకీ అదేంటో..!?

‘#8thApril... ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం ఉంది... (సశేషం)... to be continued’ అని చిరు ట్వీట్ చేశాడు. అయితే ఇంతకీ ఏంట‌బ్బా ఏప్రిల్ 8తో చిరుకున్న అంత అనుబంధం అనే చ‌ర్చ అటు నెట్టింట్లో.. ఇటు మెగాభిమానుల్లో మొద‌లైంది. కొందరైతే.. ఏప్రిల్ 8న.. మేనల్లుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ పుట్టిన రోజు కాబట్టి చిరు అలా ట్వీట్ చేశాడని చెబుతున్నారు. ఇంకొదరైతే అబ్బే అదేం కాదు.. ఈ మధ్యే చిరు తన ఆత్మకథ రాసుకున్నట్లు వార్తలు వచ్చాయ్‌గా అందులో ఏమైనా మంచి పరిణామం ఉంటుంది అందుకే ఇలా తమతో పంచుకున్నాడని మెగాభిమానులు చెప్పుకుంటున్నారు. 

ఈ మూడు విషయాలేనా..!?

మరోవైపు.. ఏప్రిల్-8నే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ బ‌ర్త్ డే కూడా ఉంది. బహుశా ఆయన లాంచింగ్ విషయం ఏమైనా పంచుకుంటారేమో అని అనుకుంటున్నారు. దీంతో పాటు మన్మథుడు, యువ సామ్రాట్ నాగార్జున కుమారుడు అఖిల్ పుట్టిన రోజు కూడా అదే రోజునే. వాస్తవానికి చిరు-నాగ్ మంచి మిత్రులు.. ఇండస్ట్రీలో ఎవరెన్ని తిట్టుకున్నా.. వీరిద్దరు మాత్రం బాగా స్నేహంగానే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరు అంటే నాగ్‌కు.. కింగ్ అంటే చిరుకు ప్రాణమని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు.. అఖిల్‌ను తన చిన్నకుమారుడిలాగా చిరు సతీమణి సురేఖ చూసుకుంటూ ఉంటారట. 

మరికొన్ని గంటలు..!

ఇలా బన్నీ, అకీరా, అఖిల్‌ల పుట్టిన రోజుకు సంబంధించి ఏమైనా ఆసక్తికర విషయాలు పంచుకుంటారేమో అనే చర్చ కూడా నెట్టింట్లో జరుగుతోంది. ఇవన్నీ కాకుండా తన సినీ కెరీర్‌కు సంబంధించి ఆ తారీఖుతో ఏదైనా ముడిపడి ఉందా..? అనేది కూడా తెలియట్లేదు. కాగా.. చిరు ట్వీట్‌ను ఎగతాళి చేస్తూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ తారీఖుకు అంత ప్రియారిటీ ఎందుకిస్తున్నారో..? ఇంతకీ అసలు విషయమేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు నెటిజన్లు, ఔత్సాహికులు.. మరీ ముఖ్యంగా మెగాభిమానులు వేచి చూడక తప్పదు మరి.

Mega Fans Thinking About On Chiru Latest tweet.!:

Mega Fans Thinking About On Chiru Latest tweet.!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs