Advertisement
Google Ads BL

ఈసారి కూడా ఆమెకే వెయిట్ ఇస్తున్నాడా..?


మన సినిమాలని గమనిస్తే హీరోయిన్లకి చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కేవలం గ్లామర్ కోసమే తప్ప వారికి సరైన పాత్రలు ఉండవు. ఇప్పడే కాదు కొన్నేళ్ళుగా ఇదే పద్దతి కనిపిస్తుంది. హీరోయిన్లకి ముఖ్యంగా ఆడపాత్రలకి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే తెలుగులో సూపర్ డూపర్ డైరెక్టర్లలో కొంతమంది లేడీస్ కి మంచి క్యారెక్టర్లు ఇస్తారు. అలాంటి వారిలో శేఖర్ కమ్ముల ముందుంటాడు.

Advertisement
CJ Advs

ఆయన సినిమాలన్నీ ఫీమేల్ సెంట్రిక్ గానే ఉంటాయి. హీరో ఉన్నప్పటికీ ఎలివేషన్ హీరోయిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఆనంద్, గోదావరి, మొన్న వచ్చిన ఫిదా వరకు అన్నీ అలాంటి కథలే.. అయితే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సంవత్సరం మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. 

సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోనూ హీరోయిన్ కే వెయిట్ ఇచ్చాడని అంటున్నారు. ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చూపించినదాన్ని బట్టి చూస్తుంటే ఇందులో సాయిపల్లవికి మంచి పాత్ర దక్కిందని ఊహాగానాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత కుర్రాడిగా కనిపిస్తున్న నాగచైతన్య పాత్ర కూడా సాయిపల్లవి పాత్రకి ఏమాత్రం తీసిపోనంతగా ఉంటుందట. కానీ వెయిట్ మాత్రం హీరోయిన్ సైడే ఉంటుందట.

Heroine dominates Hero in Love Story Movie:

Shekar kammula giving memorable character for saipallavi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs