Advertisement
Google Ads BL

మరో రెండేళ్లు మెగా కాంపౌండ్‌లోనే కొరటాల!?


టాలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. సందేశాత్మక చిత్రాలు, సామాజిక స్పృహ ఉన్న సినిమాలు తెరకెక్కించడంలో ఈయన దిట్ట.. ఈ విషయం పలుమార్లు చాలా సినిమాలతో నిరూపితమైంది. అలాంటి సినిమాలు చేశాడు గనుకే మొన్న సూపర్ స్టార్‌ మహేశ్ బాబుతో.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయగలుగుతున్నాడు. ఈయనతో సినిమాలు చేయాలంటే చాలు స్టార్ హీరోలు సైతం క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్.. రేంజ్.. కథలు విషయం అలాంటిది మరి. అంతేకాదు.. ఇంతవరకూ కొరటాల ఖాతాలో సింగిల్ ప్లాప్ కూడా పడలేదంటే అర్థం చేసుకోవచ్చు.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ టైమ్ కల్లా సినిమా షూటింగ్ సగం అయిపోయేది కానీ.. కరోనా దెబ్బతో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ అయ్యాయి. అయితే.. ఎలాగో ఈ సినిమా ఈ ఏడాది పూర్తయ్యే సరికి పూర్తయిపోతుంది సరే.. తర్వాత కొరటాల ఏం చేయబోతున్నాడు..? ఎవరితో సినిమా తీస్తాడు..? ప్రస్తుతం లాక్‌డౌన్ టైమ్‌లో ఆయన ఏమైనా కొత్త కథ రాస్తున్నాడా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే చాలా చాలా విషయాలే వెలుగుచూస్తున్నాయ్.

ఇద్దరు మెగా హీరోలతో..!?

వాస్తవానికి చిరు కంటే ముందుకు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌తో కొరటాల సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే అది వర్కవుట్ కాలేదు.. కానీ చిరుతో త్వరగానే సినిమా రెడీ అయిపోయింది. మెగాస్టార్‌తో మూవీ అవ్వగానే చెర్రీతో సినిమా ఉంటుందట. ఈ సినిమా 2021లో తెరకెక్కుతుందట. అంతేకాదు.. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీతో కూడా సినిమా ఉందట. బన్నీతో వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 మొదట్లో సినిమా ఉంటుందట. ఇప్పటికే వీరిద్దరికీ కథలు చెప్పేశాడని.. వారిద్దరూ కూడా ఒప్పేసుకున్నారని టాక్. అంటే 2021, 22 రెండేళ్ల పాటు మెగా కాంపౌండ్‌లోనే కొరటాల ఉంటాడన్న మాట. అంతేకాదు ప్రస్తుతం లాక్‌డౌన్ టైమ్‌లో మరో అదిరిపోయే కథ కూడా రెడీ చేస్తున్నాడట. ఇది ఎవరికోసమే తెలియట్లేదు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

After Acharya Koratala two Movies With Mega Heroes!:

After Acharya Koratala two Movies With Mega Heroes!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs