Advertisement
Google Ads BL

నాని స్థానంలో విజయ్‌ దేవరకొండ..!


అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని స్థానంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వచ్చేస్తున్నాడు. ఇదేంటి నాని లాంటి హీరోను వదులుకున్న ఆ డైరెక్టర్ ఎవరబ్బా అనే సందేహం కలుగుతోంది కదూ.. అవును ఆయన్ను వద్దనుకున్నాడు గనుకే విజయ్‌ను తీసుకున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడెవరు..? ఇందులో నిజానిజాలెంత..? నాని చేయలేనిది విజయ్ చేసి చూపిస్తాడా ఏంటి..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల ఫేం వివేక్‌ అందరికీ గుర్తుండే ఉంటారు. చాలా రోజుల క్రితం వివేక్ దర్శకత్వంలో నాని సినిమా ఉంటుందని వార్తలొచ్చిన విషయం విదితమే. అయితే నాని ఇప్పుడు ఓ వైపు నిర్మాతగా.. మరోవైపు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తుండటంతో ఇక మనకు అవకాశం ఇచ్చే చాన్సే లేదని విజయ్‌ దేవరకొండకు కథ చెప్పి ఓకే చెప్పించుకున్నాడట. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ తర్వాత వివేక్‌తో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే నాని మాత్రం ఇంతవరకూ తాను చేయనని ఎక్కడా చెప్పలేదు. మరోవైపు నానితో ఎప్పటికైనా చేస్తాననే ధీమా కూడా ఆ దర్శకుడిలో ఉందట. కాగా నానికి-విజయ్‌కు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్న సంగతి తెలిసిందే. అందుకే నాని స్థానంలో కచ్చితంగా తాను చేసి తీరుతానని విజయ్ ఒప్పుకున్నాడట. మరి నాని కథతోనే విజయ్‌తో తెరకెక్కిస్తాడా..? లేకుంటే కొత్త కథ రాసుకున్నాడా..? అనేది మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమాపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. 

Natural Star Nani Story to Vijay Devarakonda!:

&nbsp; Natural Star Nani Story to Vijay Devarakonda! <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs