Advertisement
Google Ads BL

పవన్ సరసన స్వీటీ.. ఇందులో నిజమెంతో!?


టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ ఇంకా షూటింగ్ కూడా పూర్తిగా కాలేదు.. అసలు ఎప్పుడు అవుద్దో.. సినిమా రిలీజ్ ఎప్పుడో కానీ.. తర్వాతి సినిమాపై లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. వాస్తవానికి రీమేక్ మూవీ తర్వాత క్రిష్-పవన్ కాంబోలో సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు షాట్‌లు కూడా తీశారని.. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా సెట్లు వేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఈ చిత్రం పూర్తిగా పట్టాలెక్కలేదు. అదేదో సామెత ఉంది కదా ‘ఆలూ లేదు.. సూలూలేదు..’ అన్నట్లుగా సినిమాపై మాత్రం అదిగో.. ఇదిగో అంటూ పుకార్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్.

Advertisement
CJ Advs

నిన్న మొన్నటి వరకూ.. పవన్-క్రిష్ మూవీలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి లక్కీ చాన్స్ కొట్టేసిందని వార్తలొచ్చాయ్. ఆ తర్వాత మరో ఇద్దరి ముగ్గురు పేర్లు కూడా తెరపైకొచ్చాయ్. అయితే తాజాగా ఏకంగా సీనియర్ హీరోయిన్, యోగా బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలేసిన స్వీటీ అనుష్క శెట్టి పేరు గట్టిగా వినపడుతోంది. పవన్ సరసన ఈ బ్యూటీని తీసుకోవాలని ఆలోచించిన దర్శకనిర్మాతలు త్వరలోనే ఆ బ్యూటీని సంప్రదించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే మరికొందరమే అబ్బే అన్నీ అయిపోయాయ్.. క్రిష్ సంప్రదించడం.. స్వీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం కూడా అయిపోయిందని వార్తలూ వినిపిస్తున్నాయి.

వాస్తవానికి.. గతంలో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ముఖ్యపాత్ర పోషించిన విషయం విదితమే. ఆ పరిచయంతోనే అనుష్కను సంప్రదించగా క్రిష్ మాటను కాదనలేక ఒప్పుకుందట. కాగా ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలని అడిగినప్పటికీ ఈ భామ ఒప్పుకోలేదని దీంతో మరో హీరోయిన్‌ను కొరటాల శివ వెతికే పనిలో ఉన్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి ‘అన్నయ్య’ సినిమాకు ఒప్పుకోని ‘తమ్ముడు’ సరసన నటించడానికి ఒప్పుకుంటున్నట్లు వస్తున్న పుకార్లలో నిజమెంతో తెలియాలంటే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కేవరకు వేచి చూడాల్సిందే.

Anushka Shetty To Star In Pawan Kalyan’s Next?:

Anushka Shetty To Star In Pawan Kalyan’s Next?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs