Advertisement
Google Ads BL

స్టార్ డమ్‌ లేకుంటే నో..నో అంటున్న రష్మిక!


‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతోంది. ‘గీత గోవిందం’ సినిమాతో ఈ బ్యూటీకి లక్ బాగా కలిసొచ్చింది. టాలీవుడ్‌లో బాగా ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ.. యూత్‌లోనూ ఈ బ్యూటీ అంటే పడిచచ్చే అభిమానులున్నారంటే అర్థం చేస్కోండి. అలా.. టాలీవుడ్‌లో నంబర్ వన్‌ కోసం తెగ ఆరాటపడుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించేసిన ఈ భామ.. మున్ముంథు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించేయాలని ఎన్నెన్నో కలలు కంటోంది. మరోవైపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెంచేసింది.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ డూపర్ హిట్‌లే అయ్యాయి. మరోవైపు రానున్న సినిమాలు కూడా కచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయంటూ గట్టి నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఓ కీలక నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే.. ఇకపై చిన్నా చితకా అంటే స్టార్ హీరోల పక్కన తప్ప మిగతావారితో అస్సలు చేయకూడదని గట్టిగా అనుకుందట. స్టార్‌డమ్ లేని హీరోల ప్రాజెక్టులు వస్తే చాలు ‘అబ్బే.. నేను చేయనండోయ్ బాబూ.. నో..నో.. మీకు అర్థమవుతోందా..?’ అని చెప్పి వెనక్కి పంపంచేస్తోందట. అంతేకాదు.. మేనేజర్ ఎవర్ని పడితే వారిని తన దాకా తీసుకురావొద్దని స్టార్ డమ్‌ లేని హీరోలయితే చాలు నో చెప్పేసెయ్ అని తెగేసి చెప్పిందట.

ఇదిలా ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సరసన నటించిన తర్వాత ఈ బ్యూటీ రేంజ్ చాలానే పెరిగిపోయింది. బన్నీ-సుక్కు సినిమాలో అవకాశం కొట్టేసింది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో యంగ్ మెగాస్టార్‌గా నటిస్తున్న రామ్‌చరణ్ సరసన కూడా నటిస్తోంది. ఇకపై కూడా ఇలాంటి స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తానని రష్మిక నిర్ణయించుకుందట. అయితే.. ఇలా కండిషన్స్ పెట్టుకుంటూ పోతో మొదటికే మోసం వస్తుందో.. లేకుంటే పరిస్థితులు మరింత చక్కబడతాయో జస్ట్ వెయిట్ అండ్ సీ.!

I Can’t Act Without Star Dum Heroes Says Rashmika:

I Can’t Act Without Star Dum Heroes Says Rashmika  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs