Advertisement
Google Ads BL

RRRని చెప్పిన టైమ్‌కే విడుదల చేస్తాం


ఈమాట అన్నది ఎవరో కాదు.. RRR రౌద్రం రణం రుధిరం నిర్మాత  డివివి దానయ్య. ఇప్పటికే ఒకసారి వాయిదాపడి జులై 31 నుండి జనవరి 8 కి విడుదల డేట్ మార్చుకున్న RRR మూవీ మరోసారి కరోనా కారణంగా వాయిదా పడుతుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. జనవరి 8 నుండి మళ్లీ జులై 31 2021 కి వాయిదా పడనుందని.. మరో ఆరు నెలల పోస్ట్ పోన్ తప్పదనే ప్రచారం జరుగుతుంది. మరి లాక్ డౌన్ కారణంగా దాదాపుగా 20 రోజుల నుండి RRR మూవీ షూటింగ్ ఆగిపోయింది.

Advertisement
CJ Advs

దానితో సినిమా మళ్లీ వాయిదా తప్పదని ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా రామ్ చరణ్ ఫాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ RRR నిర్మాత RRR విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేసాడు. RRR సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా పడే ఛాన్స్ లేదని...ఖచ్చితంగా అనుకున్న డేట్‌కే RRR రావడం పక్కా అని.. కరోనా లాక్ డౌన్ ప్రభావం మా సినిమాపై ఉండదని చెబుతున్నాడు. ఇప్పటికే RRR కి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా దాదాపు పూర్తైందని... ఈ సారి సినిమా వాయిదా వేసేందుకు ఎలాంటి కారణం లేదన్నాడు. మరి RRR నిర్మాతే స్వయంగా RRR విడుదలపై క్లారిటీ ఇచ్చాక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్‌ ఇంకెందుకు కంగారు పడుతున్నారు.

Producer DVV Danayya Clarity about RRR Release Date:

No Change in RRR Release Date Says DVV Danayya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs