బాహుబలి సినిమాతో ప్రపంచ సినిమాకి తెలుగు సినిమా అంటే ఏంటో తెలిసొచ్చింది. అంతే కాదు ప్రపంచస్థాయి సినిమాలు మనమూ తీయగలం అన్న ధైర్యాన్ని ఇచ్చింది. సరైన కథావస్తువు, దాన్ని సరిగ్గా చెప్పగలిగే దర్శకుడు దొరికితే మనం కూడా హాలీవుడ్ స్థాయికి తగ్గ సినిమాలు తీయగలమని నిరూపించింది. బాహుబలి స్ఫూర్తితో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాయి.
అయితే ఒక సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కేజీఎఫ్. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా అందరూ తేలిగ్గా తీసుకున్నారు. అయితే అందరి ఊహలని పటాపంచలు చేస్తూ కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే బాహుబలి కథతో కేజీఎఫ్ సినిమాకి ఒక పోలిక ఉందట.
కేజీఎఫ్ 2 చిత్రీకరణ జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఈ సినిమా కథ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అందులో ఒకానొక వార్త అందరినీ ఆలోచింపజేస్తుంది. బాహుబలి సినిమాలో లాగే కేజీఎఫ్ లోనూ హీరో మరణిస్తాడట. బాహుబలిలో అమరేంద్ర బాహుబలి వీరమరణం పొందినట్టుగానే కేజీఎఫ్ 2 లో యశ్ పాత్ర చనిపోతుందట. ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ వార్త నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు