Advertisement
Google Ads BL

సీసీసీకి మైత్రీ మూవీ మేక‌ర్స్ రూ. 5 ల‌క్ష‌లు విరాళం


సీసీసీకి రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేసిన మైత్రీ మూవీ మేక‌ర్స్‌.. మొత్తం క‌రోనా విరాళం రూ. 25 ల‌క్ష‌లు

Advertisement
CJ Advs

క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగ‌మ‌వుతూ ఇదివ‌రకే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధుల‌కు చెరొక రూ. 10 ల‌క్ష‌ల చొప్పున రూ. 20 ల‌క్ష‌లను విరాళంగా ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్ అంద‌జేశారు. తాజాగా శ‌నివారం క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మ‌రో రూ. 5 ల‌క్ష‌ల‌ను వారు అంద‌జేశారు. ఈ విష‌యాన్ని న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్ త‌మ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. 

‘‘రూ. 20 ల‌క్ష‌ల‌కు అద‌నంగా.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన పేద క‌ళాకారులు, కార్మికుల‌ను ఆదుకోవ‌డం కోసం చిరంజీవి గారు ఏర్పాటుచేసిన క‌రోనా క్రైసిస్ చారిటీకి కూడా మేం రూ. 5 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాం. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో మేం చేతులు క‌లుపుతున్నాం. ఈ విష‌యంలో అంద‌రం ఒక్క‌ట‌వుదాం. ఇంట్లో ఉండండి.. జీవితాల‌ను కాపాడుకోండి’’ అని వారు ట్వీట్ చేశారు.

Mythri Movie Makers donates 5 lakhs to Cine Workers :

Mythri Movie Makers 25 Lakhs help for Fight on Corana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs