Advertisement
Google Ads BL

35 సినీ జర్నలిస్ట్స్‌కి ‘టిఎఫ్‌జెఏ’ సహాయం


క‌రోనా క్రైసిస్ లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి అండ‌గా నిలిచిన ‘తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్‌’

Advertisement
CJ Advs

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిలో అంద‌రూ వుండిపోయారు. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్షించాల్సిన విష‌యం. అయితే వారంలో 24 గంటలూ పనిచేస్తూ.. ఏరోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అండ‌గా వుంటుంద‌ని త‌మ భ‌రోసా తెలియ‌జేసారు.

ప్రెసిడెంట్ ల‌క్ష్మినారాయ‌ణ మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ లో అంటే డైలీ ప్రెస్‌మీట్స్ కి హ‌జ‌రయ్యే ప్ర‌తి ఒక్క జ‌ర్న‌లిస్ట్‌కి, వీడియో జ‌ర్న‌లిస్ట్‌కి, ఫోటో జ‌ర్న‌లిస్ట్‌కి ఆసరాగా వుంటాము. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకులతో అండ‌గా నిలిచాము. ఇలానే అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కోరుకుంటున్నాము. ఏ ఒక్క‌రూ ఆక‌లితో వుండ‌కూడ‌ద‌నేది మ‌న అసోసియేష‌న్ ముఖ్య వుద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్‌గారికి గాని, రాంబాబు(tv5)గారికి కాని ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు.. మీ అంద‌రికీ చివ‌రిగా నా ప్ర‌త్యేకమైన విన్న‌పం ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.. దీన్ని అంద‌రూ అర్థం చేసుకోవాలి, ఏ ఒక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అందరం అండ‌గా వుండి పోరాడాలి.. అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్లీ అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ ద్వారా కోరుకుంటున్నాను. మంచి కార్య‌క్ర‌మాల‌కి వెన్నుదండుగా వున్న‌ మీ అంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు’’ అని అన్నారు.

‘ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం’

Note: ‘‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియాని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌గా మార్చడం జరిగింది అని గమనించగలరు’.

Telugu Film Journalists Association supports 35 cine journalists:

<span>Telugu Film Journalists Association supports 35 cine journalists during corona crisis</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs