Advertisement
Google Ads BL

అభిమానిపై ఫైర్ అయిన పాయల్..


పాయల్ రాజ్ పుత్ లాక్ డౌన్ కారణంగా ముంబయిలో తన ఇంటికే పరిమితమైంది. ఢిల్లీ నుండీ ఇటీవలే ముంబైకి షిఫ్ట్ అయిన పాయల్ లాక్ డౌన్ ని చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తుంది. సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తన అభిప్రాయాలని పంచుకుంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో అభిమానుల ప్రశ్నలకి సమాధానాలిచ్చిన పాయల్ ఒకానొక అభిమానిపై ఫైర్ అయింది.

Advertisement
CJ Advs

ఆ అభిమాని లాక్ డౌన్ నియమాన్ని ఉల్లంఘించి బయట తిరుగుతున్నానని చెప్పడంతో ఫైర్ అయిన పాయల్ కరోనా వల్ల భయంకర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బయట తిగుతున్నావా.. అది ఎంత ప్రమాదమో తెలుసా.. నీకొక్కడికే కాదు నీతో ఉండేవాళ్లకి కూడా ప్రమాదమే. ప్రభుత్వాలు కరోనాని తరిమి కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, నీ లాంటి వాళ్ళు ఆ ప్రయత్నానికి భంగం కలుగజేస్తున్నారని కోప్పడింది.

రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలో ఇలాంటి వాళ్ళుండటం వల్లే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని క్లాస్ పీకింది. అయితే లాక్ డౌన్ సమయాన్ని పాయల్ చాలా బాగా ఉపయోగించుకుంటుందట. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా లేచి యోగా చేస్తుందట. యోగా పూర్తికాగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ లని చూస్తూ కూర్చుంటుందట.

Payal Rajput fires on fan:

Payal Rajput fires on her fan who not following lockdown
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs