Advertisement
Google Ads BL

ఆ సమయంలో ఏం జరుగుతుందో నాకే తెలుసు..


విజయానికి కేరాఫ్ చిరునామాగా మారిన రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళి తన కెరీర్లో ఒక్క ఫెయిల్యూర్ ని కూడా ఎదుర్కోలేదు. ఎప్పటికప్పుడు తనని తాను పెంచుకుంటూ అభిమానుల అంచనాలకి తగ్గట్టుగా అందిస్తూ ముందుకు పోతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పటి వరకు అపజయాన్ని చూడని రాజమౌళికి సినిమా విడుదల సమయంలో టెన్షన్ ఉంటుందా అనే అనుమానం కలుగక మానదు. సాధారణంగా నిర్మాతల నుండి సినిమాలో నటించే చిన్న ఆర్టిస్టు వరకు సినిమా విడుదల అవుతుందంటే చాలా టెన్షన్ పడుతుంటారు. ఒక్కోసారి ఆ టెన్షన్ బయటకి కనిపిస్తుంటుంది కూడా. అయితే అందరిలాగే రాజమౌళి కూడా రిలీజ్ సమయంలో టెన్షన్ పడుతుంటాడట.

కానీ తాను టెన్షన్ పడుతున్నానన్న ఎక్స్ ప్రెషన్ ని అన మొహంలో కనిపించకుండా చూసుకుంటాడట. సినిమా జనాలకి నచ్చుతుందా... వాళ్ళు ఆదరిస్తారా అన్న టెన్షన్ ప్రతీ సినిమా మొదటి షో అప్పుడు కలుగుతుందట. కానీ తాను టెన్షన్ బయటకి కనిపించకుండా యాక్టింగ్ చేస్తాడట. ఆ సమయంలో తాను టెన్షన్ పడుతున్నట్టు ఎవ్వరికీ అనిపించదట. కానీ లోపల ఒత్తిడి మాత్రం ఉంటుందట. సినిమాల్లో హీరోలు నటించినట్టే రిలీజ్ టైమ్ లో తాను నటిస్తాడట.

The only person knows about me at that time:

I am very good actor at that time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs