సాయి పల్లవి అంటే ఇష్టపడని వారుండరు. సహజమైన నటనతో అద్భుతమైన డాన్స్ తో సాయి పల్లవి అందరి మనసులను దోచేసింది. ఫిదా సినిమాతో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలని పడేసింది సాయి పల్లవి. సాయి పల్లవి కూడా ఏదో గ్లామర్ షో చేసేసి... పారితోషకం పట్టుకుపోయే టైప్ కాదు. చాలా కష్టపడి నటించడానికి స్కోప్ ఉండే పాత్ర తప్ప సాయి పల్లవి కేవలం గ్లామర్ షోకి సినిమాలు ఒప్పుకోలేదు. అందుకే స్టార్ అవకాశాలు సాయి పల్లవి తలుపుతట్టినా ఆమె మాత్రం సైలెంట్ గానే ఉంది కానీ... మొహమాటానికి కూడా ఒప్పుకోలేదు. అయితే చాలా సరదాగా ఈజీగా నటించే సాయి పల్లవి ఓ సీన్‌లో నటించేందుకు చాలా కష్టపడిందట.
అది కూడా తన ఫస్ట్ తెలుగు మూవీ ఫిదా సినిమాలో ట్రాక్టర్ నడిపే సన్నివేశంలో సాయి పల్లవి చాలా కష్టపడిందట. ట్రాక్టర్ తో పొలం దున్నే సన్నివేశంలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఆయితే ఆ సీన్ చెయ్యడానికి సాయి పల్లవి ట్రాక్టర్ నడపడం నేర్చుకుందట. ట్రాక్టర్ నడపడం ఈజీనే కానీ.. ఆ ట్రాక్టర్ ని దమ్ము అంటే బురదలో నడపడం చాలా కష్టంగా ఉంటుందట.. ఇక బురదలో దమ్ము చేస్తూ ట్రాక్టర్ నడుపుతూ మోహంలో హావభావాలు పలికించడానికి చాలా కష్టపడిందట. ఈ ట్రాక్టర్ సీన్ చేయడమే నా కెరీర్ లోనే క్లిష్టమైన సీన్ అని చెబుతుంది సాయి పల్లవి. ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా సార్లు నియంత్రణ కోల్పోయానంటుంది సాయి పల్లవి.