Advertisement
Google Ads BL

షాక్: ‘ఆచార్య’ నుంచి మరొకరు అవుట్!


చిరు ఆచార్యకి వరసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్నా టైం లో హీరోయిన్ త్రిష ఆచార్య నుండి సడన్ గా తప్పుకుని.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆచార్య నుండి బయటికొచ్చినట్లుగా ట్వీట్ వేసింది. ఇక త్రిష ప్లేస్ ని కాజల్ కాస్ట్‌లీగా భర్తీ చేసింది. త్రిష ఆచార్య నుండి వాకౌట్ చెయ్యడంతో.. త్రిష ప్లేస్‌లో కొచ్చిన కాజల్ కి రామ్ చరణ్ బృందం భారీగా సమర్పించింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఆచార్య నుండి మరొకరు వాకౌట్ చేసినట్లుగా న్యూస్ నడుస్తుంది. అది కూడా ఆచార్య‌కి ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్ ని తీసుకుంటే.. ఇప్పుడాయన ఆచార్య టీం కి షాకిచ్చి బయటికొచ్చేసినట్లుగా చెబుతున్నారు. అయితే శ్రీకర్ ప్రసాద్ ఎవరి మీద అలగకపోయినా.. ప్రత్యేకమైన కారణమంటూ లేకపోయినా.. అనుకున్న సమయానికి ఆచార్య షూటింగ్ జరిగేలా లేదని.. ఆచార్య కన్నా ముందు ఒప్పుకున్న ప్రాజెక్టుల వలన శ్రీకర్ ప్రసాద్ ఆచార్య నుండి తప్పుకున్నాడట. దర్శకనిర్మాతలకు చెప్పి శ్రీకర్ ప్రసాద్ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. ఇక శ్రీకర్ ప్రసాద్ ఆచార్య నుండి తప్పుకోవడంతో మరో ఎడిటర్ నవీన్ నూలిని మూవీ టీం సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తుంది.

Shock: One more person out from Acharya Movie:

Editor Srikar Prasad Out From Acharya Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs