Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌కి నచ్చిన భామే చరణ్‌కి కూడా..!


అప్పుడెప్పుడో ఎన్టీఆర్ మీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు.. ఏ హీరోయిన్ డాన్స్ అంటే ఇష్టము అని అడిగితె.. నాకు సాయి పల్లవి డాన్స్ అన్నా ఆమె నటన అన్నా చాలా ఇష్టమని చెప్పాడు. అదిగో ఎన్టీఆర్ సాయి పల్లవి అంటే ఇష్టమని చెప్పాడో లేదో.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ సాయి పల్లవినే అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం యంగ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న సాయి పల్లవి.. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేస్తూ.. ఏదో ఒకటి అరా సీన్స్ కి పరిమితమయ్యే రోల్స్ ఒప్పుకోకుండా పాత్రకి ప్రాధాన్యమున్న సినిమాలు చేసుకుంటుంది. అయితే అప్పుడు ఎన్టీఆర్ తనకి ఇష్టం సాయి పల్లవి అని చెబితే ఇప్పుడు మరో హీరో అదే మాట చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

తాజాగా రామ్ చరణ్ ని మీకిష్టమైన హీరోయిన్ ఎవరని అడగగా.. అందరూ రామ్ చరణ్ తో నటించిన హీరోయిన్స్ లో ఎవరో ఒకరి పేరు చెబుతాడులే అనుకుంటే... తనకి ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అంటే ఇష్టమని చెప్పి అందరికీ షాకిచ్చాడు. మరి సాయి పల్లవి నటనకు, డాన్స్ కి అందరూ ఫిదానే. కానీ ఆమెకి స్టార్ హీరోల ఛాన్స్ లే రావడం లేదు. గతంలో మహేష్ బాబు సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్ వచ్చినప్పటికీ... లిప్ లాక్ కిస్ ఉంటుంది అనే కారణంగా సాయి పల్లవి ఆ ఛాన్స్ వదులుకుంది అని అన్నారు. ఇక రామ్ చరణ్ మనసులో సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్ గా ఉంది అంటే.. రాబోయే కాలంలో చరణ్ ఏమైనా సాయి పల్లవికి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చేమో. 

Ram Charan also liked Sai Pallavi:

Ram Charan and NTR likes sai pallavi performance 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs