Advertisement
Google Ads BL

బాలయ్య మరోసారి రిస్క్ చేయబోతున్నాడు..


రూలర్ సినిమాతో భారీ డిజాస్టర్ తెచ్చుకున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రమిది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే బాలయ్య తన తర్వాతి చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఈ సారి సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడట.

Advertisement
CJ Advs

బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య చేసిన నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్ని హిట్లు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆయన ఫామ్ లో లేడు. ఇంతకుముందు ఫామ్ లో లేని కే యస్ రవికుమార్ తో సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. రూలర్ సినిమా వల్ల బాలక్రిష్ణ మార్కెట్ బాగా పడిపోయింది. అయినా కూడా మళ్లీ సీనియర్ డైరక్టర్ అయిన బి గోపాల్ తో సినిమా చేసి రిస్క్ చేయడం  అవసరమా అంటున్నారు.

ఫామ్ లో లేని అవుట్ డేట్ అయిన డైరెక్టర్ తో సినిమా చేసి రిస్క్ చేసిన బాలయ్య మరోసారి అదే రిస్క్ చేసి తన మార్కెట్ ని మరింత దిగజార్చుకుంటాడేమో అని ఆయన అభిమానులు భయపడుతున్నారు. అయితే బి గోపాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా స్క్రిప్టుని సిధ్దం చేస్తున్నాడని సమాచారం. మరి ఈ అవుట్ డేటెడ్ డైరక్టర్ బాలయ్యకి హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Balayya taking risk again...:

B Gopal is going to direct Balayya again...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs