స్వర్గీయ అంజలీదేవి తరువాత టాలీవుడ్‌లో అంతటి గుర్తింపు, పేరు తెచ్చుకున్న తెలుగు భామ ఎవరైనా ఉన్నారంటే.. అంజలీ అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదమో. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో గట్టిగానే సినిమాలు చేసి మంచి పేరే సంపాదించుకుంది. అయితే ఆ మధ్య ఆమె ఇంట్లో నెలకొన్న వివాదాలతో వివాదాస్పదురాలిగా మారింపోయింది.!. దీంతో అప్పటి వరకూ ఆమెకున్న క్రేజ్ కాస్త తగ్గినట్లయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ వేదికగా ఇదే విషయం ప్రస్తావనకు రాగా భావోద్వేగానికి లోనవుతూ సమాధానమిచ్చింది.
ప్రశ్న : ఆనాటి సీత బాధపడినట్లు.. మీరున్న రంగంలో ఎప్పుడైనా బాధపడ్డారా!? అనే ప్రశ్న ఎదురవ్వగా.. అసలు రియల్ లైఫ్‌లో ఏం జరిగింది..? రీల్ లైఫ్‌లో జరిగిన విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది.
అంజలి : తనను తాను చేసిన సినిమాలు ఫెయిలైనా భగవంతుని దయ వల్ల బాధపెట్టలేదని.. తాను చేసిన సినిమాలు మరీ హిట్ కాకపోయినా మినిమమ్ గ్యారంటీతో ఆడాయని చెప్పుకొచ్చింది. సినిమాల పరంగా తానెప్పుడు బాధపడలేదు కానీ.. గతంలో మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చి అవి అందరి నోళ్ళల్లోనూ బాగా నానాయని చెప్పింది. అయితే.. తాను ఆ టైమ్‌లో బాధలో ఉన్నప్పుడు ఓదార్చినవారు తక్కువనేనని చెప్పిన ఆ భామ.. ‘నా పనైపోయింది అని సన్నిహితులుగా వున్నవారే నా గురించి హేళనగా మాట్లాడటం నాకు బాధను కలిగించింది. ఇప్పటికీ ఆ మాటలు నా మనసును గాయపరుస్తూనే ఉంటాయి’ అని భావోద్వేగంతో చెబుతూ ఒకింత కంటతడి పెట్టింది అంజలీ.
రియల్ లైఫ్‌లో.. జరిగిన ఆ ఒక్క రీల్ లైఫ్‌లో మాత్రం తాను హ్యాపీగానే ఉన్నానని అంజలీ చెప్పింది. కాగా.. ఒకప్పుడు తెలుగులో వరుస అవకాశాలు రావడం.. ఆ సినిమాలన్నీ కూడా వరుస విజయాలు అందుకోవడం విశేషం. కానీ ఇప్పుడు కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకవేళ వచ్చిన అంతంత మాత్రమే. మరీ ముఖ్యంగా తమిళ కుర్రాడిని ఇష్టపడిందని.. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. షూటింగ్స్ స్పాట్‌కు వచ్చి మరీ డిస్టబ్ చేస్తున్నాడని దర్శకనిర్మాతలు చెప్పడంతో వచ్చే అవకాశాలు కూడా చేజేతులారా పోతున్నాయ్.