‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రౌద్రం రుధిరం రణం’ అని.. సినిమాలో చెర్రీ, జూనియర్ పాత్రలు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు రెండు వీడియోల్లో జక్కన్న చూపించేశాడు.
ఈ సినిమా నుంచే కాపీ అట..
ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇద్దరి హీరోల పాత్రలను బట్టి ఇదిగో ఈ సినిమా ఫలానా సినిమాలా ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. అంతేకాదు.. ఆ సినిమా పేరు కూడా పెట్టి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమా మన తెలుగు, తమిళ్, బాలీవుడ్ కూడా కాదండోయ్.. 1983లో విడుదలైన ఫాంటసీ అడ్వెంచరస్ హాలీవుడ్ మూవీ ‘ఫైర్ అండ్ ఐస్’ కాన్సెప్ట్‌కి ఇది దగ్గరగా ఉందట. ఇందులో నుంచే ఒక పాయింట్ ఎత్తేసి కథ అల్లేశాడని.. ఇంగ్లీషోడి సినిమాను చక్కగా కాపీ కొట్టేసి తెలుగులో వాడేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. అయితే రాజమౌళి, ఎన్టీఆర్, చెర్రీ అభిమానులు మాత్రం ఇది కాపీ అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తున్నారు.
అదేగా టాలెంట్ అంటే..!
వాస్తవానికి.. రాజమౌళి సినిమా అంటే.. ఎక్కడో ఓ చోట్నుంచి ‘కాపీ’ చేసి ఉంటాడనే నింద ‘సింహాద్రి’ నుంచి మొన్నటి ‘బాహుబలి’ వరకూ ఏ సినిమా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా.. అదే ముద్ర ‘ఆర్‌ఆర్‌ఆర్’పై కూడా పడింది. అయితే ఒకవేళ సింగిల్ పాయింట్ తీసుకొని ఉండొచ్చుగాక.. కానీ దాంతో సినిమా అల్లడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు కదా.. అదే కదా మరి టాలెంట్ అంటే..!. ఇప్పటి వరకూ జక్కన్నపై ఎన్ని కాపీ మరకలు పడినప్పటికీ అంత పాపులారిటీ వచ్చింది.. అలా విమర్శలు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ను షేక్ చేసినవే.. అదే బాటలో ఈ ‘RRR’ కూడా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.. సో.. జస్ట్ వెయిట్ సీ..!