Advertisement
Google Ads BL

అప్పుడు ‘అన్నగారు’.. ఇప్పుడు ‘బుడ్డోడు’.. అదుర్స్!


టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైలే వేరని క్రిటిక్స్ సైతం చెబుతుంటారు. ఎందుకంటే.. ఎలాంటి బ్రాగ్రౌండ్ లేకున్నా ఈ స్థాయికి రావడం.. ఆయన ఎంచుకునే కథలు.. అభిమానుల పట్ల ఆయన చూపే ప్రేమాభిమానులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పట్నుంచీ తాత (నందమూరి తారకరామారావు)కు తగ్గ మనవడు వచ్చాడని అందరూ చెప్పుకున్నారు. ఒక రకంగా చూస్తే జూనియర్ ఆ పేరు నిలబెట్టాలని భగీరథ ప్రయత్నాలే చేస్తూనే వస్తున్నాడు.. కాకపోతే అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. అయితే ఏదో ఒకరోజు అన్నగారంత స్థాయికి కాకపోయినా.. కాస్త అటో ఇటో స్థాయిని మాత్రం చేరుకోవడం పక్కా అని అభిమానులు గట్టిగానే నమ్ముతున్నారు.

Advertisement
CJ Advs

బుడ్డోడ్ని కొట్టేవాడు లేడుగా!

వాస్తవానికి అన్నగారితో బుడ్డోడిని పోల్చడం ఎంతవరకూ సబబు కాదులెండి కానీ.. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కడో సింక్ అవుతున్నట్లే ఉంది. ఇందుకు చక్కటి ఉదాహరణ అన్నగారి వాయిస్ వింటే జనాల్లో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేసేది.. అయితే ఆ స్థాయిలో ఇప్పుడు ఎవరూ లేరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే. అప్పుడప్పుడు సినిమాల్లో అన్నగారిలా మాట్లాడి జూనియర్ అలరిస్తుంటాడు. అప్పట్లో ‘యమదొంగ’ సినిమాతో అచ్చం అన్నగారే దిగొచ్చారని అభిమానులు అనుకున్నారు. తెలుగు పదాలను పలకడంలో.. ఎక్కడ పిచ్ పెంచాలో..? ఎప్పుడు తగ్గించాలో..? సన్నివేశం తగ్గట్టుగా ఎమోషన్‌ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో జూనియర్‌కు జూనియరే సాటి. ఒక్క మాటలో చెప్పాలంటే డైలాగ్స్ డెలివరీలో అయితే బహుశా టాలీవుడ్‌లో ఇప్పుడు కుర్ర హీరోల్లో బుడ్డోడిని కొట్టేవాడే లేడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

తాతతో మనువడ్ని పోల్చేస్తున్నారు!

తాజాగా.. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో జూనియర్ వాయిస్‌ను విని మళ్లీ పాత ఎన్టీఆర్‌ను అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటున్నారట. వాస్తవానికి ఈ వీడియోను బట్టి చూస్తే సినిమా రేంజ్ సంగతేమో కానీ.. నందమూరి ఫ్యాన్స్, సినీ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ వీడియో కింద ఎవరు చూసినా తాతతో మనువడ్ని పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే.. ‘అప్పుడు అన్నగారు.. ఇప్పుడు బుడ్డోడు.. అదుర్స్!’ అని కూడా కామెంట్స్ చేసేస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉండగా.. కామెంట్స్‌తో తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. సింగిల్ టీజర్‌తోనే పరిస్థితి ఇలా ఉంటే సినిమాలో జూనియర్ వాయిస్ ఎలా ఉంటుందో అని ఔత్సాహికులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

News About Sr NTR and Jr NTR:

News About Sr NTR and Jr NTR  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs