Advertisement
Google Ads BL

వాళ్ళకోసం ఎమోషనల్ అయిన మంచు విష్ణు..


లాక్ డౌన్ కారణగా దేశవ్యాప్తంగా విపరీతమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ ఉంటుందని తెలియని వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా చోటే ఉండిపోయి.. తన సొంత వారిని కలుసుకోవడానికి వీలు లేకుండా లాక్ అయిపోయారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబాన్ని బాగా మిస్సవుతున్నారు. మంచు విష్ణు పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఆయన తన భార్యాపిల్లల్ని మిస్ అవుతున్నాడట.

Advertisement
CJ Advs

లాక్ డౌన్ ప్రకటించే కొన్ని రోజులు ముందు ఆయన భార్యా పిల్లలు వేరే దేశానికి వెళ్ళారట. ఆ టైమ్ లో కరోనా విజృంభణ పరిగిపోవడంతో అంతర్జాతీయ విమానాలు రద్దాయ్యాయి. దాంతో వాళ్ళు అక్కడే లక్ అయిపోయారు. మామూలు రోజుల్లో కూడా విష్ణు ఎక్కడికి వెళ్ళినా రాత్రి వరకి ఇంటికి చేరుకునే వాడట. ఆయనకి పిల్లలతో చాలా అటాచ్డ్ గా ఉంటారట. అందువల్ల ఇప్పుడు వాళ్లు తన కళ్ల ముందు లేకపోవడంతో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నాడట.

ఈ విషయాన్ని వీడియో రూపంలో వెల్లడి చేసిన విష్ణు వారి గురించి మాట్లాడుతూ కళ్లనీళ్ళు పెట్టుకున్నంత పనిచేశాడు. ఈ వీడియోలో గుబురు గడ్డంతో కనిపించిన విష్ణు భార్యా పిల్లలు తన దగ్గరికి వచ్చేవరకి గడ్డం తీయనని చెప్పాడు. మంచు విష్ణు లాగే తమ కుటుంబాన్ని వదిలి ఉండలేకపోతున్నవారు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఇవన్నీ తప్పవు.

Manchu emotional about his family:

Manchu vishnu missing his family..who are out of country because of lockdown
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs