Advertisement
Google Ads BL

కరోనా: బాలయ్య వాయిస్ వినబడటం లేదేంటి?


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పేరు మార్మోగిపోతోంది. దాసరి తర్వాత చిరునే ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. తాజాగా కరోనా విషయంలో చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం, అలాగే కరోనాపై కోటి ఆధ్వర్యంలో నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తో కలిసి ఓ పాటేసుకోవడం, అలాగే కరోనా వైరస్ కారణముగా అతలాకుతలం అయిన తెలుగురాష్ట్రాలకు విరాళాలు ఇచ్చే విషయంలోను. ఇక సినీ కార్మికులకు ఓ ట్రస్ట్ ద్వారా సేవలందించడం, మా లో లుకలుకలు జరుగుతున్నప్పుడు చిరు పెద్దరికం తీసుకోవడం లాంటి విషయాల్లో చిరు అందరిని కలుపుకుపోతున్నాడు.

Advertisement
CJ Advs

చిరంజీవి తనంతట తానుగా బాధ్యతలు తీసుకుని తెలుగు ఇండస్ట్రీని ఒక తాటిపైకి తెస్తున్నాడు. అయితే ఇప్పుడు చిరు హైలెట్ అవుతుంటే బాలయ్య కామ్ గా వుంటున్నాడు. బాలకృష్ణ జస్ట్ కరోనా బాధితుల కోసం విరాళం ఇచ్చేసి ఊరుకున్నాడు కానీ.. కరోనా విషయంలో ఎక్కడా జాగ్రత్తలు చెప్పడం లేదు. అందరూ చిరుకి సలాం కొడుతుంటే.. బాలయ్య వంటరి వాడైనట్లే కనబడుతుంది. అటు రాజకీయాల్లో ఫెయిల్. ఇటు సినిమాల విషయంలో వరస ప్లాప్స్ తో బాలకృష్ణ డల్ అయ్యాడు. కరోనా తో ఏపీ తెలంగాణ అతలాకుతలం అయినా.. బాలకృష్ణ ముందుకొచ్చి ఫ్యాన్స్‌కి సందేశం ఇవ్వలేదు. 

ఇక చిరు ఎప్పుడూ గొడవ పడే మోహన్ బాబు తోనూ ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. మరి చిరు, బాలయ్య స్నేహం బాగానే ఉంటుంది. చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినా బాలయ్య విష్ చెయ్యలేదు. ఇక బాలయ్య.. కరోనా విషయంలోనూ సపోర్ట్ చెయ్యడం లేదు. బాలయ్య మరీ ఇలా ఒంటరివాడిగా మారిపోయాడంటున్నారు. 

Why Balakrishna was Silent on these days:

Balakrishna not responded on Corona
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs