Advertisement
Google Ads BL

రాజమౌళికే షాకిచ్చిన స్టార్ హీరో..!


రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో బాలీవుడ్, తమిళ, తెలుగు, హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న రౌద్రం రుధిరం రణం సినిమా మోషన్ పోస్టర్, రామ్ చరణ్ RRR స్పెషల్ వీడియో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కరోనా సమయాన్ని వేస్ట్ చెయ్యకుండా రాజమౌళి RRR ప్రచారానికి వాడేస్తున్నాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటూ ఏం లేకపోయినా.. కరోనా టైం మాత్రం రాజమౌళికి బాగా కలిసొచ్చింది. అయితే ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి RRR ముచ్చట్లను వెల్లడిస్తున్నాడు.

Advertisement
CJ Advs

RRR లో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ని రాజమౌళి తెగ పొగిడేస్తున్నాడు. గత రెండు నెలలుగా RRR షూటింగ్ లో పాల్గొంటున్న అజయ్ దేవగన్ కి RRR లో నటించమని సంప్రదించినప్పుడు ఓ 10 నిమిషాల స్టోరీ నేరేట్ చెయ్యగానే.. రాజమౌళి గారు షూటింగ్ ఎపుడు మొదలెడుతున్నామని అడిగాడట. అప్పుడే షాకయిన రాజమౌళి.. RRR సెట్స్ లో అజయ్ దేవగన్ సింప్లిసిటీకి మరింత షాకయ్యాడట. బాలీవుడ్ నటులతో సినిమాలంటే  కష్టమనుకునేవాడిని... వారికీ సెట్స్ లో కావాల్సిన ఏర్పాట్లలో ఎలాంటి లోటు వస్తుందో అనే భయం ఉండేది. కానీ అజయ్ దేవగన్ మాత్రం RRR సెట్స్ లో కేవలం డ్రెస్ చేంజ్ సమయంలో తప్ప కార్ వ్యాన్ వాడేవారు కాదు.... తన సీన్స్ అయిపోయినా.. అజయ్ దేవగన్ సెట్స్ లోనే ఉండేవారు. అలాగే కార్ వ్యాన్ లో భోజనము కూడా చేసేవారు కాదు.. అందరితో పాటుగా బయటనే తినేవారు. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అజయ్ దేవగన్ సెట్స్ లోనే ఉండేవారని ఆయన సింప్లిసిటీ చూసి నేను మాత్రమే కాదు... RRR టీం మొత్తం షాకయినట్లుగా చెబుతున్నాడు రాజమౌళి. 

Rajamouli Shocks with Bollywood Star Hero Gesture :

Ajay devgan gives shock to RRR Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs