Advertisement
Google Ads BL

మంచు విష్ణు మళ్లీ కెలికాడుగా..!


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు సినిమాలు అంటూ రెండు పడవల మీద కాలేసాడు. రాజకీయాల్లో మొదట్లో అన్నతో విభేదించిన పవన్ తాజాగా అన్న చిరు కుటుంబంతో అనుబంధం మెయింటైన్ చేస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళ్ళకముందు పవన్ కళ్యాణ్ చిరు మీద మాట పడనిచ్చేవాడు కాదు. గతంలో వజ్రోత్సవాలు జరిగినప్పుడు మోహన్ బాబు చిరు మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద సంచలనం కాగా.. పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా చిరు కి మోహన్ బాబు కి మధ్య చిచ్చు రేగింది.

Advertisement
CJ Advs

అయితే వజ్రోత్సవ వేడుకల్లో చిరుని ఉద్దేశించి మోహన్ బాబు అన్నప్పుడు పవన్ కళ్యాణ్  ఆవేశంగా మోహన్ బాబు మీద స్టేజ్ మీదకి వెళ్లి తమ్ముడూ మోహన్ బాబూ అంటూ ఆవేశంగా మాట్లాడాడు. ఇక చాలారోజులు చిరుకి మోహన్ బాబుకి మధ్యన కోల్డ్ వార్ నడిచినా.. తాజాగా వారిమధ్యన స్నేహం తెగ హైలెట్ అవుతుంది. అయితే తాజాగా మంచు విష్ణు, పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. పవన్ కళ్యాణ్ వజ్రోత్సవాలప్పుడు స్టేజ్ మీద అలా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ అనవసరంగా ఓవర్ రియాక్టయ్యారని అందరికి అనిపించింది. అసలు పవన్ గారు అలా ఎందుకు రియాక్ట్ అయ్యారో ఆయన్నే అడిగితే సమాధానం దొరుకుతుంది. నాకు తెలిసి ఆ రోజు మా నాన్న గారు అంత వివాదాస్పదంగా ఏమీ మాట్లాడలేదు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకలా మాట్లాడారో.  గత కొన్నేళ్లుగా నాన్నగారు, చిరంజీవి గారు కలిసి మెలిసి ఉంటున్నారు అంటూ పవన్ విషయాన్ని మరోసారి సంచలనం చేశాడు మంచు విష్ణు.

Manchu Vishnu sensational comments on Pawan Kalyan:

Manchu vishnu again Highlights Pawan and mohan babu controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs