Advertisement
Google Ads BL

తమిళ స్టార్ హీరోకి కరోనా టెస్ట్...


కరోనా వైరస్ వల్ల ప్రజల ప్రాణాలు అగాధంలో పడిపోతున్న సమయంలో ప్రతీ ఒక్కరూ ఆందోళనకి గురవుతున్నారు. ప్రపంచంలో ఈ వైరస్ బారిన పడ్డవారు రోజురోజుకీ పెరుగుతున్నారు. ఒకరిని నుండి మరొకరికి అంటుకునే ఈ వ్యాధి మనదేశంలోకి విదేశం నుండి వచ్చినవారిలోనే మొదటగా కనుగొనబడింది. దాంతో వేరే దేశం నుండి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కరోనా టెస్ట్ చేస్తున్నారు. మార్చ్ ఒకటవ తేదీ నుండి ఇప్పటి వరకు ఎంతమంది విదేశాల్లో నుండి మనదేశం చేరుకున్నారో వారందరికీ కరోనా టెస్ట్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో ఇళయదలపతి విజయ్ కి కరోనా టెస్ట్ చేశారు. సినిమా షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్ళిన విజయ్ ఈ మధ్యే చెన్నైకి తిరిగి వచ్చాడట. దాంతో అతనితో సహా వాళ్ళింటి వారందరికీ కరోనా టెస్ట్ నిర్వహించారు. విజయ్ కి కరోనా టెస్ట్ నిర్వహించారని తెలిసే సరికి ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. విజయ్ కి తమిళంలో అభిమానులు చాలా ఎక్కువ. ఈ అభిమానులందరూ కరోనా టెస్ట్ లో నెగెటివ్ రావాలని దేవుణ్ణి ప్రార్థించారు.

అయితే వారి ప్రార్థనలు నిజమై కరోనా నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

corona test to Tamil star Hero:

corona test to Tamil star hero..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs