Advertisement
Google Ads BL

కరోనాపై యుద్ధం: మెగా బ్రదర్స్ హ్యాట్సాప్!!


ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై మెగా బ్రదర్స్ యుద్ధం ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీ పరంగా మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించడం.. అలా విరాళాలు ప్రకటించిన ప్రముఖులును మెచ్చుకోవడం.. వారిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకించి సమయం కేటాయించి మరీ సుధీర్ఘంగా మాట్లాడటం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఈ ఇద్దరు బ్రర్స్ చేస్తూ వస్తున్నారు. నిజంగా ఇది చాలా మంచి పరిణామం అని.. మెగా బ్రదర్స్‌కు క్రిటిక్స్ సైతం హ్యాట్సాప్ చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ఇలాంటి తరుణంగా మెగాభిమానులు నిజంగా గర్వంగా ఫీలవుతున్నారు. ఎందుకంటే ఎలాంటి పదవీ లేకుండానే పెద్దన్న సినీ కార్మికుల కోసం.. చిన్నన్న ప్రజల కోసం తాపత్రయ పడుతున్నారంటే.. వీరికే గనుక ఏదైనా హోదా గల మంచి పదవి ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలాగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరే అని కాదు టాలీవుడ్ తరఫున ప్రతి ఒక్కర్నీ అభినందించాల్సిందే. ఎందుకంటే ఒక్క కరోనా విషయంలోనే కాదు పలు సందర్భాల్లో తమ వంతుగా సాయం చేయడానికి టాలీవుడ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఇందుకు ప్రత్యేకించి మరీ ఉదహరణలు చెప్పనక్కర్లేదు. సో.. యావత్ టాలీవుడ్‌కు అభినందనలు.. ప్రత్యేకించి మెగా బ్రదర్స్‌కు హ్యాట్సాప్.

Hats Off To Mega Brothers:

Hats Off To Mega Brothers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs