Advertisement
Google Ads BL

సమంత వరకు వెళితే అస్సలు వదలదు


ఈ మధ్యన సమంత చేసే కేరెక్టర్స్ ఆమెకి ఛాలెంజ్ విసురుతున్నాయి. పెళ్లి తర్వాత సమంత స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేస్తూ ఉండిపోకుండా తనకి ప్రాధాన్యమున్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. గ్లామర్ షో అంటూ హీరో పక్కన కాసేపు నిలబడే పాత్రల్ని సమంత లైట్ తీసుకోబట్టే ఆమె చేతిలో సినిమాలు లేవు. యూటర్న్, మజిలీ, ఓ బేబీ, జాను చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన పాత్రలు ఉంటే తాను తప్పక నటిస్తా అంటూ దర్శకనిర్మాతలకు సవాల్ విసురుతుంది. ఇక అలాంటి కేరెక్టర్స్ కి సమంత బెస్ట్ ఆప్షన్ అంటూ దర్శకులు ఫిక్స్ అయ్యేలా కనబడుతున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా సింగీతం శ్రీనివాస్ ఓ బయోపిక్‌ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ప్రస్తుతం బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ అనే దేవ‌దాసి క‌థ‌ని సినిమాగా మలిచే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న సింగీతంకి బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్రకి ఏ హీరోయిన్ అయితే బావుంటుంది అనే ఆలోచన రాగానే ముందుగా ఆయన మదిలోకి సమంతనే వచ్చిందట. ఇలాంటి కేరెక్టర్స్‌ని అలవోకగా అదరగొడుతున్న సమంత బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్రకి పర్ఫెక్ట్ అని... అందుకే కరోనా  ప్రభావం వదలగానే ముందు సింగీతం సమంత ఇంటి తలుపు తట్టాలని ప్లాన్‌లో ఉన్నాడని అంటున్నారు. అయితే సమంత గనక కాదంటే మరో హీరోయిన్ గురించి ఆలోచిస్తారట. అయితే సమంత మాత్రం ఇలాంటి పాత్రలను ఎందుకు వదిలేస్తుంది. తనకిష్టమైన పాత్రలను సమంత అస్సలు వదులుకోదు... మరొకరికి ఛాన్స్ ఇవ్వదు.

singeetam srinivasa rao waiting for samantha for his next film:

samantha for singeetam srinivasa rao Nagaratnamma Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs