Advertisement
Google Ads BL

నితిన్ బర్త్‌డే స్పెషల్: ‘రంగ్ దే’ ట్రీట్ ఇదే


ఈ నెల 30 న నితిన్ పుట్టినరోజు సందర్భంగా ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

యువ కథానాయకుడు నితిన్, మహానటి కీర్తి సురేష్‌ల తొలి కాంబినేషన్‌లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ, మిస్టర్ మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ నెల 30న చిత్ర కథానాయకుడు నితిన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ‘రంగ్ దే’ చిత్రం మోషన్ పోస్టర్‌ను  విడుదల చేసింది చిత్రయూనిట్. చిత్ర నాయకా,నాయికలైన అను, అర్జున్ (నితిన్, కీర్తి సురేష్)లను పరిచయం చేస్తూ ఈ మోషన్ పోస్టర్ ముస్తాబయింది.  

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, మాస్టర్ రోనిత్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా, అడిషనల్ స్క్రీన్‌ప్లే : సతీష్ చంద్ర పాశం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత:సూర్యదేవర నాగవంశీ

రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

Click Here for Motion Poster

Nithiin RangDe First Look Released:

Introducing our Anu and Arjun RangDe First Look  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs