Advertisement
Google Ads BL

అభిమానుల ఆశలు నా మీద ఒత్తిడి పెంచవు..


ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ కి యూట్యూబ్ లో విశేష స్పందన లభిస్తుంది. రౌద్రం రణం రుధిరం అంటూ వచ్చిన ఈ టైటిల్ ని ఆర్ ఆర్ ఆర్ గానే పిలుస్తున్నారు. టైటిల్ తో అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసిన రాజమౌళి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మరింత పెంచాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఎవ్వరి అంచనాలకి అందని విధంగా రామరాజు లుక్ ని డిజైన్ చేశాడు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ లుక్ ని రిలీజ్ చేసిన నేపథ్యంలో రాజమౌళి బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మాసంద్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రతీ ఒక్కరు ఇళ్ళకే పరిమితమైన తరుణంలో వీడియో చాట్ ద్వారా రాజమౌళిని పలకరించాడు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఇద్దరు సూపర్ స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు వారి అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు.. మా హీరోని అలా చూపించాలి.. ఇలా చూపించాలి అని అనుకుంటారు.

సోషల్ మీడియా ద్వారా అడుగుతుంటారు కుడా. అలాంటి టైమ్ లో అభిమానుల గురించి ఆలోచిస్తారా... వాళ్ల అంచనాలని దృష్టిలో పెట్టుకుంటారా అని అడిగారు. దానికి సమాధానంగా రాజమౌళి చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. అభిమానులు చాలా తక్కువ మందే ఉంటారు. వారి కంటే జనరల్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. నేను తీసే సినిమా జనరల్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయితే ఎక్కువ సంతోషిస్తానని చెప్పాడు.

Those expectations didnt stress to me.:

Rajamouli said fans are very few.. but general audiences are more 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs