Advertisement
Google Ads BL

‘రౌద్రం రుధిరం రణం’ మాకొద్దు.. ‘RRR’ చాలు!


రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో RRR అంటూ ఎప్పుడైతే అనౌన్స్ చేసాడో.. అదిగో అప్పటి నుండి రామ్ చరణ్ - రామారావు - రాజమౌళి అంటూ RRR పేరుని టైటిల్ గా ఫిక్స్ అయ్యారు జనాలు. RRR కి సరిపోయే టైటిల్ పెట్టండి అంటూ ఏదో క్రేజ్ కొద్దీ కాంటెస్ట్ నడిపిన రాజమౌళికి మైండ్ లో RRR టైటిల్ ఎప్పుడో తయారైంది. కానీ ఫ్యాన్స్ ఏం ఊహిస్తారో చూద్దామని కాంటెస్ట్ నడిపాడు. కానీ రాజమౌళి ఊహలకి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ రీచ్ కాలేదు. కాబట్టే రాజమౌళి ఎపుడో అనుకున్న RRR టైటిల్ ని మొన్న ఉగాదికి వదిలాడు. రామ్ చరణ్ R ని రౌద్రం గా ఎన్టీఆర్ R ని రుధిరంగా... మరో R ని రణంగా మార్చేశాడు. రౌద్రం రణం రుధిరం అంటూ RRR ఫుల్ ఫామ్ చెప్పాడు.

Advertisement
CJ Advs

కానీ ఆ టైటిల్ కి రాజమౌళి అనుకున్న రెస్పాన్స్ సోషల్ మీడియాలో రాలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ కూడా RRR టైటిల్ విషయంలో తృప్తి పడలేదు. అందుకే రాజమౌలి రౌద్రం రణం రుధిరం అని పెట్టినప్పటికీ ఇండియా వైడ్ గా RRR టైటిల్ RRR గానే ఉండబోతుంది. RRR అంతగా జనాల నోళ్ళలో నానుతుంది. రామ్ చరణ్ - రాజమౌళి - రామారావు అనే ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. కానీ రౌద్రం రుధిరం రణం అనే మాత్రం ఎక్కడా వినబడడం లేదు. కనీసం ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ కూడా RRR ఫుల్ ఫామ్ వాడడం లేదు. కేవలం RRR అంటున్నారు. అంటే సినిమా విడుదలైనప్పుడు కూడా RRR రిలీజ్ అంటూ హంగామా చేస్తారు కానీ... రౌద్రం రుధిరం రణం అనే పదం వాడేలా కనిపించడం లేదు. 

Fans not Interested on RRR Full Form Title:

we wants only RRR says Charan and jr ntr fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs