సినీ కార్మికుల కోసం రూ.10 లక్షలు విరాళమిచ్చిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్. సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు.
సి.సి.సి ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 20 లక్షలు వితరణ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇప్పుడు రూ.10 లక్షల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు సంస్థ అధినేతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు.
సినీ కార్మికుల కోసం రూ.20 లక్షలు విరాళమిచ్చిన వరుణ్ తేజ్.
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్. సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు.
ఈ పిలుపుకు స్పందించిన యువ హీరో వరుణ్ తేజ్ తన వంతుగా ఈ సినీ కార్మికుల సహాయ నిధి కి రూ. 20 లక్షలు వితరణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న మన సినిమా కార్మికులకు సి.సి.సి ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నా అని వరుణ్ తేజ్ అన్నారు.
తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం హీరో శర్వానంద్ రూ. 15 లక్షల విరాళం
హీరో శర్వానంద్ ఆదివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా ‘ఐయామ్ శర్వానంద్’ అనే ట్విట్టర్ అకౌంట్‌తో సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. దినసరి వేతనంతో పనిచేసే కార్మికులు సినిమా సెట్లపై అందరికంటే ఎక్కువగా కష్టపడుతుంటారని పేర్కొన్న ఆయన, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటిస్తూ, అందరూ తమ ఇళ్లల్లోనూ సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని శర్వానంద్ కోరారు.
సినీ కార్మికుల కోసం రూ. 20 లక్షల విరాళం ప్రకటించిన హీరో రవితేజ
కరోనా వ్యాప్తి భయం కారణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడంలో భాగంగా హీరో రవితేజ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. తన వంతుగా ఈ మొత్తాన్ని కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన తెలిపారు. ఇవ్వడమనే విషయం వచ్చేదాకా తీసుకోవడమనే ప్రయోజనం ఎప్పటికీ పూర్తికాదనీ తెలిపిన రవితేజ.. ఇది బాధను కొలవడం కాదు, సినీ కార్మికుల అవసరాలను తీర్చడంలో తోడ్పాటు మాత్రమే అని పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఇంటిపట్టునే సురక్షితంగా ఉండాలని కోరారు.
సినీ కార్మికుల కోసం రూ.10 లక్షలు విరాళమిచ్చిన సుప్రీమ్ హీరో సాయి తేజ్
కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్. సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ’కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు.
సి.సి.సి ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 10 లక్షలు వితరణ చేసిన సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇప్పుడు రూ.10 లక్షల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు ప్రకటించారు.