రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో రౌద్రం రణం రుధిరం RRR సినిమాని పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఎవరికీ వారే టాలీవుడ్ లో తోపు హీరోలు, ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పి విలన్స్ కి వార్నింగ్ ఇచ్చాడంటే ఫాన్స్ కి పూనకాలే. ఎన్టీఆర్ అంత అద్భుతంగా డైలాగ్స్ చెబుతాడు. అలాగే రామ్ చరణ్ కూడా చాలా పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పగల సత్తా ఉన్న నటుడు. అయితే తెలుగు, తమిళ హిందీ భాషల్లో ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగులో దున్నేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు.
కానీ ఈ హీరోలిద్దరూ తెలుగులో చెప్పగలిగినంతగా హిందీ, తమిళ భాషల్లో పవర్‌పుల్‌గా డైలాగ్స్ చెప్పగలరా? ఇప్పటివరకు బాలీవుడ్ టచ్ లేని ఎన్టీఆర్‌కి తెలుగులో చెప్పినట్టుగా పవర్ ఫుల్‌గా హిందీ భాషలో డైలాగు ఇరగదీయగలడా? ఇక తమిళ్ అంతో ఇంతో టచ్ ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తమిళంలోనూ అంతే. తెలుగులో చెప్పేంతగా తమిళ డైలాగ్స్ ని వల్లించగలరా? రామ్ చరణ్ అయితే బాలీవుడ్ జంజీర్ తో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి.. చరణ్ కి కాస్త హిందీ టచ్ ఉంది. కానీ ఎన్టీఆర్ కి లేదు. మరి మొహంలోనూ ఎక్సప్రెషన్ కి ఇతర భాషలో చెప్పే డైలాగ్ కి పొంతన లేకపోతే తేడా కొడుతోంది. ఇక ప్రభాస్ బాహబలితో బాలీవుడ్ లోను ఓన్ డబ్బింగ్ తోనే ఆకట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడా మిస్ ఫైర్ అవలేదు. మరి రాజమౌళి పర్ఫెక్ట్ గా డైలాగ్ వచ్చేవరకు ఊరుకోడు. కాబట్టి ఎన్టీఆర్, చరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్ పై అభిమానులు బెంగ పెట్టుకోనక్కర్లేదు అంటున్నారు.