Advertisement
Google Ads BL

సురేష్ ప్రొడక్షన్స్ కోటి.. చరణ్ మరో 30 లక్షలు


సినీ కార్మికులు, వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ద‌గ్గుబాటి ఫ్యామిలీ రూ. 1 కోటి ఆర్థిక సాయం

Advertisement
CJ Advs

క‌రోనాపై పోరాటంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ త‌మ వంతు భాగ‌స్వామ్యం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. క‌రోనా వ్యాప్తి నిరోధంలో నిరంత‌రం శ్ర‌మిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద క‌ళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌ కోటి రూపాయ‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. రోజువారీ వేత‌నంతో ప‌నిచేసే సినీ కార్మికులు నిత్యావ‌రాల కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌నీ, వాళ్ల‌ను ఆదుకోవ‌డం త‌మ బాధ్య‌త‌గా భావించి, వారికి ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌నీ సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా తెలిపారు. అలాగే త‌మ జీవితాల‌కు ప్ర‌మాదం అని తెలిసినా నిత్యం రోగుల‌తో స‌న్నిహితంగా మెల‌గుతూ వారి ఆరోగ్యం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తూ వ‌స్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు.

ఈ సంక్షోభ కాలాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లంద‌రూ విధిగా పాటించాల‌ని సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, రానా కోరారు. అత్య‌వ‌స‌రం అయితేనే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లాల‌ని, గుంపులుగా మాత్రం వెళ్ల‌వ‌ద్ద‌ని వారు చెప్పారు. అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ, ప్ర‌భుత్వాల‌కు స‌హ‌క‌రిస్తూ క‌రోనాపై పోరాటంలో విజ‌యానికి తోడ్ప‌డాల‌ని సురేశ్‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు.

 

సినీ కార్మికుల కోసం రూ.30 లక్ష‌లు విరాళ‌మిచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. 

సి.సి.సి ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 70 లక్షలు వితరణ చేసిన మెగాపవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు రూ.30 ల‌క్ష‌ల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అంద‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Ram Charan and Suresh Productions Helps Poor Cine Workers:

Suresh Productions announces 1 CR And Ram Charan 30 Lakhs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs