కరోనా వైరస్ మూలంగా అన్ని రకాల సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ ఆగిపోవడంతో రోజువారి సినీ కార్మికుల పరిస్థితి ఘోరంగా తయారైంది. సినిమా షూటింగ్ ఉంటేనే డబ్బులు సంపాదించుకునే వీరి జీవితాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించి స్థంభింపజేసింది. ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎంత పెద్ద సినిమాకి అయినా వీళ్ళు లేకపోతే ఒక్కరోజు కూడా షూటింగ్ నడవదు.
వీరి గురించి సినిమాలో పేరు కూడా ఉండకపోవచ్చు. కానీ వీరు లేకపోతే మాత్రం సినిమా తెరకెక్కదు. అలాంటి వారి జీవితం స్థంబించిందని గమనించిన హీరోలు కొందరున్నారు. అలాంటి హీరోలు వీరికి సాయం చేసి ఆదుకుంటున్నారు. ఆ జాబితాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు చేరిపోయాడు. రోజు వారి సినీ కార్మికుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు సాయం ప్రకటించాడు.
సినిమానే నమ్ముకుని తమ జీవితాన్ని నమ్ముకున్న వారికి సినిమా మీదే బ్రతుకుతున్న హీరోలు తమ వంతు సాయం చేయడం నిజంగా మంచి పరిణామం. ఈ విషయమై మహేష్ మీద ప్రశంసల జల్లు పడుతోంది. టాలీవుడ్ నుండి ఎంతో మంది హీరోలు కరోనా వైరస్ పై పోరాడుతున్న ప్రభుత్వానికి తమకి తోచిన విరాళాన్ని ప్రకటించారు. విరాళాల్లో మనవాళ్ళు బాలీవుడ్ హీరోలని దాటిపోయారు.