Advertisement
Google Ads BL

తెలుగోళ్లు బూతులు తిడుతున్నారు: చిన్మయి


సింగర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న చిన్నయి శ్రీపాద గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ గాయని సినిమాకు సంబంధించి వార్తలకంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ భాష.. ఈ భాష అని కాకుండా చిన్మయికి అన్ని భాషల్లోనూ ఈమె గాత్రానికి అభిమానులున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే ఈమె పాటలకు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు. అయితే.. అలా ఆదరించి ఈమెను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన తెలుగు అభిమానుల విషయంలో చిర్రెత్తుకొచ్చిందట. దీంతో సహనం కోల్పోయిన అభిమానులు తనను బండ బూతులతో తిడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమెను ఎందుకు తిడుతున్నారు..? ఇందులో నిజానిజాలెంత..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

Advertisement
CJ Advs

ఎందుకిలా.. బూతులు!?

‘తెలుగు వాళ్లు తనను సోషల్ మీడియాలో ఇష్టానుసారం తిట్టిపోస్తున్నారు. వాళ్లు మాట్లాడే బూతులు నేను అర్థం చేసుకుంటున్నాను. నన్ను అది ఇదీ అని తిట్టేస్తున్నారు. ఛీ.. నన్ను ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. రోజులో యాభై, వందకి పైగా నన్ను చెప్పలేని పదాలతో తిడుతున్నారు. తెలుగు సోషల్ మీడియా జనరల్ డీఫాల్ట్ ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నోరు తెరిస్తే చాలు అబ్బాయిలు అంతా ఈ పదాన్నే వాడుతున్నారు. *** అనే మాట తప్ప ఇంకేం రాదు. తమిళ్‌లో కూడా ఆ పదాన్ని ఎక్కువగా వాడేస్తుంటారు. నన్ను ఎంత తిట్టినా ఐ డోన్ట్ కేర్. వాళ్లు వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతే అని వదిలేస్తున్నా. నాకేంటి అది పెద్ద విషయం కాదు. మిగతా వాళ్లు అలా బిహేబ్ చేస్తున్నారని మనం మార్చుకోలేం. అది వాళ్ల పెంపకం. వాళ్లు నా గురించి ఏమన్నా అంటే నాకేంటి? అది పెద్ద విషయం కాదు. నేను ఏంటో నాకు తెలుసు.. వీళ్లు వాగారని నేను ఏడుస్తూ కూర్చోను’ అని చిన్మయి చెప్పుకొచ్చింది. అయితే ఎందుకిలా తిడుతున్నారు..? ఏ విషయంలో తిడుతున్నారనేదానిపై మాత్రం చిన్మయి క్లారిటీ ఇవ్వలేదు.

News About Popular Singer Chinmayi:

News About Popular Singer Chinmayi  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs