హాట్ ఫొటోస్‌తో ఫ్యాన్స్‌కు శ్రద్ధా బూస్టప్!


కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న తరుణంలో ఇండియాలో లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. మరోవైపు ఈ కరోనా నేపథ్యాన్ని నటీమణులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇంకొందరైతే ఏకంగా హాట్ హాట్‌ ఫొటోస్, క్లిప్పింగ్స్‌తో నెటిజన్లకు మంచి బూస్టప్ ఇస్తున్నారు. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కరోనా నేపథ్యంలో ఏదో మంచి పని వీలయితే రాష్ట్ర ప్రభుత్వాలకు తోచినంత సాయం ప్రకటించి ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి.. ఎవరెటుపోతే నాకేంటి.. అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇక హాట్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ విషయానికొస్తే.. ఈ భామ మొదట్నుంచి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. మాంచి హాట్ హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ కనువిందు చేస్తుంటుంది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, నెటిజన్లతో ఫాలోయింగ్ పెరిగిపోయింది.

అయితే.. తాజాగా కరోనా హాలీడేస్‌ని తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాననే దానిపై ఓ నాలుగైదు ఫొటోలు రిలీజ్ చేసింది. ఇదిగో పక్క ఫొటోలో చూడండి.. కనులవిందుగా ఉంది కదూ.. ఇలాంటి తరుణంలో వర్కవుట్ చేయడంలో ఎలాంటి తప్పులేదు కానీ.. ఇలా మరీ ఫోజులివ్వడం ఎంతవరకు సబబో..!. ఇలాంటి హాట్ హాట్ ఫొటోలతో కుర్రాలకు నిద్రలేకుండా చేస్తోందీ భామ. ఒక లెక్కన చెప్పుకుంటే ఈ ఫొటోలను కొందరు ఆస్వాదిస్తుంటే మరికొందరు మాత్రం బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతేనే కావాల్సిన వాళ్లకు మాత్రం గట్టిగానే శ్రద్ధా బూస్టప్ ఇస్తోందిగా.. అదే చాలనుకుంటున్నారు!.

Actress Shradda Dass Hot Hot Photos!:

Actress Shradda Dass Hot Hot Photos!
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES