Advertisement
Google Ads BL

మహేష్.. ‘మహానటి’ని కోరుకుంటున్నాడు


మహేష్ బాబు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతగా షూటింగ్ పనులతో అలసిపోయినా.. పిల్లలు ఫ్యామిలీ కోసం టైం కేటాయించే మహేష్ బాబు.... ఈ కరోనా సెలవులతో వెకేషన్‌కి వెళ్లకపోయినా.. ఫ్యామిలీ‌తో ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాడు. సితార పాపతో మహేష్ ఆటలతో టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. ఇక మహేష్ అటు ఫ్యామిలీతో పాటుగా పరశురామ్ తో సినిమా విషయంలో ఎప్పుడూ ఫోన్ టచ్ లోనే ఉంటున్నాడట. 14 రీల్స్ - మైత్రి మూవీస్ కాంబోలో మహేష్ - పరశురామ్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయం ఎప్పటికప్పుడు మహేష్, పరశురామ్‌ని అడిగి తెలుసుకుంటున్నాడట.

Advertisement
CJ Advs

ఇక పరశురామ్.. నాగ చైతన్య‌తో సినిమా చెయ్యడానికి రెడీ అయినప్పుడు చైతూకి జోడిగా హీరోయిన్ గా తన లక్కీ హీరోయిన్ రష్మికనే అనుకున్నాడట. అయితే ఇప్పుడు మహేష్ సినిమా విషయానికి వచ్చేసరికి.. పరశురామ్ ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. కానీ మహేష్ మాత్రం రష్మిక వద్దు.. ఇప్పుడే సరిలేరు నీకెవ్వరూ చేసేసాం. ఇక మహానటిలో కీర్తి సురేష్ నటన చాలా బావుంది. మన సినిమాలో ఎలాగూ హీరోయిన్ కి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కీర్తి సురేష్ ని సంప్రదించమంటూ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ప్రిఫర్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి మహేష్ - పరశురామ్ సినిమా ఈ కరోనా హడావిడి ముగిశాకే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోపు పరశురామ్ మహేష్ కోసం పక్కా స్క్రిప్ట్ తో ఇంప్రెస్స్ చెయ్యాల్సి ఉంటుంది.

Mahesh Babu wants Mahanati for his next :

Mahesh Babu wants Keerthi Suresh for Parasuram film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs