కరోనా నివారణ కోసం ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ రూ. 20 లక్షల విరాళం
కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అహర్నిశలూ కృషి చేస్తున్నాయని ప్రశంసించిన అశ్వినీదత్.. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తూ.చ. తప్పకుండా పాటించాలని కోరారు. కుటుంబాలను పక్కనపెట్టి మరీ పోలీసులు, వైద్య సిబ్బంది అలుపనేది లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు. వాళ్ల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలనీ, అందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా పై పోరాటానికి యంగ్ హీరో సుధీర్ బాబు 2 లక్షల విరాళం
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే కరోనా నివారణకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు తమ వంతుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్రముఖ హీరో సుధీర్ బాబు కూడా ముందుకొచ్చారు. 2 లక్షల రూపాయలు విరళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో లక్ష రూపాయలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా నిధికి మరో లక్ష రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి అందించనున్నారు. దేశ ప్రధాని పిలుపు మేరకు 21 రోజులు లాక్ డౌన్ కి తన సంపుర్ణ మద్ధత్తు తెలిపిన సుధీర్ బాబు, ఇంటి దగ్గర ఉంటూనే ఫిటనెస్ ని మెయింటైన్ చేయాలో వీడియోలు చేసి విడుదల చేశారు. అలానే తన అభిమానులకు, ప్రజలకు హెల్తీ టిప్స్ ఇస్తున్నారు సుధీర్ బాబు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థిత్తుల్ని సైతం లెక్క చేయకుండా మనకోసం పని చేస్తున్న ఎందరో డాక్టర్స్, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే బయటకు రాకుండా ఇంటిలో ఉండటమే అన్ని విధాల సురిక్షతం. ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యకు మనందరం సహకరించాలని తన అభిమానులకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు సుధీర్ బాబు.