Advertisement
Google Ads BL

మోహన్ బాబు- చిరు మళ్లీ అలరించారు


టాలీవుడ్‌లో నాగార్జున కి బాలకృష్ణ కి అస్సలు పడదనేది బహిరంగ సత్యం. ఏదో స్టేజి మీద కలిస్తే ఇద్దరు ఒకరికొకరు పలకరించుకున్నప్పటికీ... బయట మాత్రం వాళ్ళకి పడదనేది బలమైన న్యూస్. ఇక తర్వాత మోహన్ బాబు - చిరు ఇద్దరికీ అస్సలు పడదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్న టైప్ లో ఉంటారు. కానీ ఈ మధ్యన మోహన్ బాబు - చిరు స్నేహం చూస్తుంటే అబ్బో వీరి స్నేహం చూడముచ్చటగా ఉంది అంటున్నారు. మా డైరీ ఆవిష్కరణలో ఒకరికొకరు హగ్గులు, ముద్దులు, కామెడీ సెటైర్స్ అబ్బో అసలు వీరికి పడదు అంటే ఎవ్వరు నమ్మలేనంతగా ఉంది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడమే విశేషమైన ఆదరణ పొందుతున్నాడు. ఉగాది కానుకగా ఎంట్రీ ఇచ్చిన చిరు అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు. ఇక చిరు సోషల్ మీడియా ఎంట్రీ ని సినిమా ప్రముఖులంతా ఆహ్వానించడమే కాదు... చిరు కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందులో మోహన్ బాబు కూడా ఉన్నాడు. మోహన్ బాబు చిరు కి స్వాగతం మిత్రమా అంటూ ట్వీట్ చెయ్యగా.. దానికి చిరు థాంక్యూ మిత్రమా అంటూనే రాననుకున్నావా.. రాలేననుకున్నావా అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దానికి మోహన్ బాబు కూడా ఈసారి మనం కలుసుకున్నప్పుడు చెబుతా.. అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. 

interesting conversation between chiru and mohan babu:

Mohan babu welcomes chiru to social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs