జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ కూడా షురూ అయిపోయాయి. వాటిలో ఒకటి ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్.. మరో సినిమాకు క్రిష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ‘వకీల్ సాబ్’లో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్. ఈ సినిమాకు ఆమె పాత్రే కీలకం అని.. ఆమె చుట్టూనే కథ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే.. ఆమెను కూడా సినిమాలో నటించాలని సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పుకార్లు ఆ నోటా.. ఈ నోటా పడి రేణు చెవిన పడటంతో ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చేసుకుంది.
పచ్చి అబద్ధం..
‘పవన్ సినిమాలో నేను నటిస్తున్నాను అనేది పచ్చి అబద్ధం. ఎవరో రూమర్లు స్టార్ట్ చేస్తారు.. అసలు రూమర్లు స్టార్ట్ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నేను ఆ సినిమాలో నటించడం లేదు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ రూమర్లు రావడం పట్ల నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది’ అని రేణు క్లారిటీ ఇచ్చుకుంది.
సూచనలు..
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించిందిం. అంతేకాదు.. ఇంట్లో పెద్ద వారిని బాగా చూసుకోవాలని.. తన కూతురు ఆధ్యా ఇంట్లోనే స్కేటింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, శాండ్‌విచ్ కుకింగ్ బాగా చేస్తోందని రేణూ చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘బద్రి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వగా.. ‘జానీ’ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ కాంబోలో సినిమా రాలేదన్న విషయం విదితమే. బహుశా భవిష్యత్తులో కూడా ఇది జరగని పనేనేమో.